హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌ రైళ్లపై ప్రపంచ బ్యాంకుతో రైల్వే చర్చలు

ప్రధానాంశాలు

Published : 29/09/2021 06:16 IST

హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌ రైళ్లపై ప్రపంచ బ్యాంకుతో రైల్వే చర్చలు

ఈనాడు, దిల్లీ: దేశంలో బుల్లెట్‌ రైళ్లను ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్న రైల్వేశాఖ.. దానికి కావాల్సిన నిధుల కోసం ప్రపంచ బ్యాంకుతో చర్చలు జరుపుతోంది. హైదరాబాద్‌- బెంగళూరు, ముంబయి-హైదరాబాద్‌ సహా 13 మార్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ పదమూడులో ఒకటైన ముంబయి-అహ్మదాబాద్‌ మార్గం పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. దీనికి జపాన్‌ ఆర్థిక సాయం చేస్తోంది. రాబోయే 30 ఏళ్లలో 8,000 కి.మీ. హై స్పీడ్‌ కారిడార్లను, మరో 8,000 కి.మీ. సరకు రవాణా కారిడార్లను నిర్మించాలనేది రైల్వే ప్రణాళిక. దీనికి సుమారు రూ.40 లక్షల కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా. ఈ బృహత్తర పనిలో పోషించాల్సిన పాత్రపై ప్రపంచబ్యాంకు ఉన్నతాధికార వర్గాలు రైల్వేతో చర్చలు ప్రారంభించాయి. కొన్ని స్టేషన్ల అభివృద్ధిలో, ప్రస్తుత మార్గాలను మెరుగుపరచడంలో ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం పంచుకోవడంపై ప్రపంచ బ్యాంకు దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) నమూనాపై ఆసక్తి కనపరుస్తోంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన