100 కోట్ల డోసులు పూర్తికాగానే.. రైల్వేస్టేషన్లు, విమానాలలో ప్రకటన

ప్రధానాంశాలు

Updated : 15/10/2021 06:26 IST

100 కోట్ల డోసులు పూర్తికాగానే.. రైల్వేస్టేషన్లు, విమానాలలో ప్రకటన

దిల్లీ: దేశంలో 100 కోట్ల కొవిడ్‌ టీకా డోసులు పూర్తికాగానే ఆ విషయాన్ని ఘనంగా ప్రకటిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మనసుఖ్‌ మాండవీయ అన్నారు. ఈనెల 18 లేదా 19 నాటికి వంద కోట్ల లక్ష్యం పూర్తవుతుందని, ఆరోజు విమానాలు, ఓడలు, మెట్రో రైళ్లు, రైల్వేస్టేషన్లలో ఈ ప్రకటన వెలువడుతుందని తెలిపారు. స్పైస్‌జెట్‌ విమానాలపై ప్రధాని మోదీ, ఆరోగ్య కార్యకర్తల ఫొటోలతో ప్రత్యేక పోస్టర్లు ప్రదర్శిస్తారన్నారు. గురువారం దిల్లీలో కొవిడ్‌ యోధులపై పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి.. ఆరోగ్య సిబ్బంది సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా 8 రాష్ట్రాల నుంచి 13 మంది కొవిడ్‌ యోధులను ప్రత్యేకంగా గుర్తించారు. వైరస్‌ నియంత్రణలో వారు దేశానికి ద్వార పాలకులుగా నిలిచారని కొనియాడారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన