వ్యాక్సిన్‌పై దేశాన్ని ప్రధాని తప్పుదోవ పట్టిస్తున్నారు: కాంగ్రెస్‌

ప్రధానాంశాలు

Published : 23/10/2021 05:18 IST

వ్యాక్సిన్‌పై దేశాన్ని ప్రధాని తప్పుదోవ పట్టిస్తున్నారు: కాంగ్రెస్‌

దిల్లీ: కొవిడ్‌-19 టీకా కార్యక్రమానికి సంబంధించి దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. శుక్రవారం జాతినుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో లెక్కలన్నీ అబద్ధమని పేర్కొంది. భారత్‌ ఒక్కటే వంద కోట్ల మైలురాయిని దాటిందని మోదీ చెబుతున్నారని, అయితే సెప్టెంబరులోనే చైనా 216 కోట్ల డోసులను పూర్తి చేసిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ తెలిపారు. చైనా జనాభాలో 80% మంది రెండు డోసులు వేసుకున్నారని, భారత్‌లో అది 20శాతానికే పరిమితమని చెప్పారు. సంవత్సరాంతానికి అందరికీ టీకా వేస్తామని ప్రధాని చెప్పడంపై వల్లభ్‌ అనుమానం వ్యక్తం చేశారు. ‘‘ఇంకా 70 రోజులే ఉన్నాయి. ఈ వ్యవధిలో 106 కోట్ల డోసులు ఎలా వేస్తారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని వల్లభ్‌ డిమాండ్‌ చేశారు.

‘శతకోటి’ టీకాలపై ప్రశంసల వర్షం
వంద కోట్ల కొవిడ్‌-19 టీకా డోసుల మైలురాయి దాటిన భారత్‌ను వివిధ దేశాలు అభినందించాయి. ఇది గొప్ప ఘనత అని అస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ట్వీట్‌ చేశారు. మారిషస్‌ ప్రధాని ప్రవీణ్‌ కుమార్‌ జగ్‌నాథ్‌, సెయింట్‌ కిట్స్‌ ప్రధాని నెవిస్‌ తిమోతి, డొమినికన్‌ ప్రధాని రూస్‌వెల్ట్‌, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలు గ్రెగరీ మీక్స్‌ తదితరులు ప్రధానికి అభినందనలు తెలిపారు. వీరందరికీ మోదీ ధన్యవాదాలు తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన