ద్విచక్ర వాహనంపై మృతదేహం తరలింపు

ప్రధానాంశాలు

Published : 28/10/2021 05:42 IST

ద్విచక్ర వాహనంపై మృతదేహం తరలింపు

కటక్‌, న్యూస్‌టుడే: ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అధికారులు సౌకర్యాలు కల్పించకపోవడంతో కుటుంబసభ్యుడు, బంధువు కలిసి ద్విచక్ర వాహనంపైనే తీసుకెళ్లిన ఘటన బుధవారం ఒడిశాలోని కటక్‌ జిల్లా బంకి ప్రాంతంలో చోటుచేసుకుంది. ధన్‌సారా గ్రామానికి చెందిన అజయ్‌కుమార్‌(65) అనారోగ్యానికి గురవడంతో బంకిలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. బుధవారం మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ కావాలని ఆసుపత్రి అధికారులను మృతుని కుటుంబసభ్యులు కోరారు. తమవద్ద వాహనాలు లేవని అధికారులు చెప్పారు. ప్రైవేటు అంబులెన్సుకు డబ్బులు లేకపోవడంతో స్నేహితుడి ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని గ్రామానికి తరలించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన