IPL 2021: పొట్టి ఫార్మాట్‌లో కేవలం వికెట్లు తీస్తే సరిపోదు: తబ్రెయిజ్‌ షంసి

ప్రధానాంశాలు

Published : 17/09/2021 22:56 IST

IPL 2021: పొట్టి ఫార్మాట్‌లో కేవలం వికెట్లు తీస్తే సరిపోదు: తబ్రెయిజ్‌ షంసి

ఇంటర్నెట్‌ డెస్క్‌: పొట్టి ఫార్మాట్‌లో కేవలం వికెట్లు తీస్తేనే జట్టు విజయం సాధించలేదని రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు తబ్రెయిజ్‌ షంసి అన్నాడు. కొన్ని సందర్భాల్లో కట్టుదిట్టంగా బంతులేస్తే కూడా ప్రత్యర్థి జట్టును కట్టడి చేయగలమని పేర్కొన్నాడు. ‘దుబాయి పిచ్‌లపై బౌలింగ్‌ చేయడం కష్టం. కానీ, వికెట్లు తీసేందుకు ఇదే మంచి అవకాశం. కొన్ని సందర్భాల్లో 3-4 కీలక వికెట్లు తీస్తే విజయం సాధించవచ్చు. ప్రత్యర్థి జట్టుకు 35-40 పరుగులు అవసరమైనప్పుడు కట్టుదిట్టంగా బంతులేసినా విజయం సాధించవచ్చు. అందుకే పొట్టి ఫార్మాట్లో కేవలం వికెట్లు తీస్తేనే సరిపోదనేది నా అభిప్రాయం’ అని షంసి అన్నాడు.

ఈ ఐపీఎల్ సీజన్‌ మొదటి దశలో తనను పక్కన పెట్టడంపై షంసి స్పందించాడు. ‘కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. యాజమాన్యానికి మన అవసరముందనిపిస్తే జట్టులోకి తీసుకుంటుంది. లేకపోతే లేదు. ఐపీఎల్‌ మలి అంచెలో నాకు జట్టులో చోటు కల్పించడం సంతోషకరం. రాజస్థాన్ రాయల్స్‌ని విజేతగా నిలిపేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా’ అని షంసి చెప్పాడు. రాజస్థాన్‌ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ టై మిగతా సీజన్‌కి దూరం కావడంతో.. తబ్రెయిజ్‌ షంసిని జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన