
తాజా వార్తలు
దిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హ్యూందాయ్ భారత మార్కెట్లోకి మరో సెడాన్‌ను తీసుకురానుంది. ‘ఆరా’ అని దీనికి పేరుపెట్టింది. ఈ విషయాన్ని నేడు ప్రకటించింది. కాకపోతే కారుకు సంబంధించిన వివరాలను బయటపెట్టలేదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సబ్ కాంపాక్ట్ సెడాన్‌కు ఎక్సెంట్‌కు దీనిని అప్‌గ్రేడ్‌గా భావిస్తున్నారు. ఈ కారుకు సంబంధించిన పలు నమూనాలను ఇప్పటికే భారత రోడ్లపై పరీక్షించారు. దీనిపై కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ ‘ఆధునికత, సౌకర్యాలు, భద్రత, స్టైల్, సాంకేతికతల సమేళనంగా దీనిని తీసుకువస్తున్నాం’’ అన్నారు. ఎంతదూరమైనా ప్రయాణిస్తామనే విశ్వాసం, సానుకూల దృక్పథం ప్రతిబింబించేలా ‘ఆరా’అని పేరు పెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. అత్యంత ఉన్నతమైనదాని కంటే మెరుగైన ఉత్పత్తిని భారతీయ వినియోగదారులకు ఇచ్చేలా ‘ఆరా’ను డిజైన్ చేసినట్లు పేర్కొంది.
ఇప్పటికే ఉన్న ఎక్సెంట్‌ను ట్యాక్సీ సేవలకు అనుగుణంగా ఉపయోగించినా.. సరికొత్త ‘ఆరా’ను ప్రైవేటు వినియోగదారులకు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఇప్పటి వరకు కంపెనీ ఈ కారుకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. కానీ, దీనిలో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ల్యాప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్, స్మార్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
