close

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

అమరావతి: ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన ఘనత మన దేశానికే సొంతమని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. దేశ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతోపాటు వారి భావాలను నిర్భయంగా వెల్లడించే స్వేచ్ఛ కల్పించడం రాజ్యాంగ ప్రత్యేకమన్నారు. 70వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ రచనలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కృషి అనన్య సామాన్యమని కొనియాడారు. అగ్రవర్ణాల స్థాయికి చేరుకునేలా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చదువు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల, ప్రాథమిక హక్కులు, సమాన అవకాశాలు రాజ్యాంగం ద్వారానే సాధ్యమవుతున్నాయని గవర్నర్‌ చెప్పారు. సామాన్యులు తమ హక్కులకు భంగం కలిగితే వాటిని తిరిగి కోర్టుల ద్వారా పొందే వీలు కల్పించారన్నారు. ఆదేశా సూత్రాల ద్వారా ప్రజలకు ఏం చేయాలి? ఎలాంటి వసతులు కల్పించాలో ప్రభుత్వాలకు రాజ్యాంగం నిర్దేశించిందని గవర్నర్‌ గుర్తు చేశారు. దేశ సమగ్రతను దెబ్బతీసే విధమైన చర్యలను ఉపేక్షించకూడదన్నారు. 

మన రాజ్యాంగానికి ఎన్నో విశిష్ట లక్షణాలున్నాయని... పరిస్థితులకు అనుగుణంగా అమలులో సవరణలు సైతం తీసుకొచ్చారని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి తెలిపారు. ప్రజలకు కల్పిస్తున్న హక్కుల గురించి ప్రవేశికలోనే స్పష్టం చేశారని చెప్పారు. ప్రాథమిక హక్కులను ప్రతి ఒక్కరు పొందవచ్చని- వీటికి ఇబ్బందులు కలిగితే న్యాయ, పాలన వ్యవస్థలను ఆశ్రయించొచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌,  మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని తదితరులు పాల్గొన్నారు.

హక్కుల రక్షణ మన బాధ్యత: తమిళిసై

దేశ, రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడం ప్రజల బాధ్యత అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. ఎన్నాళ్లు బతుకుతున్నామో కాదు.. ఎలా బతుకుతున్నామన్నదే ముఖ్యమని ఆమె తెలిపారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన 70వ రాజ్యాంగ వార్షిక దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆమె ప్రసంగించారు. ‘ ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాజ్యాంగ ప్రతినిధులంతా ఇక్కడ ఉన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి మన రాజ్యాంగం రక్షణ కల్పిస్తోంది. రాజ్యాంగం కల్పించిన రక్షణ యువతకు చాలా వరకు తెలియదు. రాజ్యాంగం గురించి యువత  సంపూర్ణంగా తెలుసుకోవాలి’ అని గవర్నర్‌ అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ గౌరవాన్ని అత్యున్నత స్థితిలో నిలుపుదామని పిలుపునిచ్చారు.

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ అన్నారు. భారతదేశానిది డైనమిక్‌ రాజ్యాంగమని, అనేకసార్లు మార్పులు, చేర్పులు జరిగాయని సీఎం గుర్తు చేశారు. రాజ్యాంగంలో పేర్కొన్న మూడు వ్యవస్థలకు కీలక బాధ్యతలు ఉన్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ అన్నారు. జాతి పునర్‌ నిర్మాణానికి మనమంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం ఏం చేసిందనే దానికన్నా..మనం ఏం చేస్తున్నామో గుర్తించాలని చెప్పారు.

 


 




Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.