close

తాజా వార్తలు

చక్కటి బంధానికి కావాలి నమ్మకం

కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో సత్సంబంధాలు ఉండాలంటే... చక్కటి భావ వ్యక్తీకరణ అవసరం. అది లేనప్పుడు... కలతలు, అపోహలు...ఇలా ఎన్నో అనర్థాలు ఎదురవ్వొచ్ఛు దాన్ని అలవాటు చేసుకోవాలంటే...ఈ సూత్రాలు పాటించాలి.

నమ్మకం: ఎదుటివారికి ఏమైనా చెప్పడానికి ముందు ఆ విషయాన్ని మీరు పూర్తిగా నమ్మగలగాలి. అప్పుడే దాన్ని ఎదుటివారూ అర్థం చేసుకోగలుగుతారు. అలాకాకుండా మీరు ఏదో ఒకటి చెప్పాలనుకుంటే...సరిగా వ్యక్తీకరించలేరు. దాంతో అవతలివారి నమ్మకాన్ని కోల్పోతారు.

ఏకాగ్రత: చక్కగా మాట్లాడాలంటే...ముందు అంతే బాగా ఎదుటివారు చెప్పేది వినగలగాలి. అప్పుడే వారి భావోద్వేగాలు అర్థమవుతాయి. మీరూ దానికి తగినట్లుగా స్పందించగలుగుతారు. ఇలా చేసినప్పుడే మీ బంధం బలపడుతుంది.

ఉదాహరణలతో: ఎదుటివారితో మాట్లాడేటప్పుడు పొడిపొడిగా చెప్పడం వల్ల ఇతరులు వినడానికి ఆసక్తి చూపించకపోవచ్ఛు మీరు చెప్పాలనుకున్న అంశం ఆధారంగా వివిధ ఉదాహరణలు, సందర్భాలను ప్రస్తావించొచ్ఛు ఇవి వారికి భలే చెబుతున్నారే అనే భావన కలిగిస్తాయి.

బాధపెట్టొద్దు: ఎంత చక్కగా మాట్లాడినా...ఇతరులను కించపరిచేలా వ్యంగాస్త్రాలు విసరడం మంచిది కాదు. ఎదుటివారి బాధల్ని, గతం తాలూకు గాయాల్ని గుర్తుచేస్తూ మాట్లాడొద్ధు అవన్నీ వారిని నొప్పిస్తాయి.

వాదించొద్దు: మీ మధ్య వచ్చే చర్చల్లో కొన్ని అంశాలు ఎంతకీ తెగవు. అలాంటప్పుడు నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్న ధోరణిలో వాదించొద్ధు అక్కడికక్కడ దానికి ముగింపు పలకడం మేలు. అలాచేస్తే..మీ వల్ల ఎవరూ నొచ్చుకోరు.

క్షమాపణ: కొన్నిసార్లు ఏదయినా మాట్లాడుతున్నప్పుడు, మరేదయినా విషయాన్ని చర్చిస్తున్నప్పుడు తెలియకుండానే ఎదుటివారిని బాధపెట్టొచ్ఛు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు పట్టించుకోనట్లు వదిలేయకుండా దాన్ని గుర్తించి వెంటనే క్షమాపణ చెప్పగలగాలి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.