Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 67976
            [news_title_telugu_html] => 

నేనింకా విరాట్‌ జాతకం చూడలేదు: గావస్కర్‌

[news_title_telugu] => నేనింకా విరాట్‌ జాతకం చూడలేదు: గావస్కర్‌ [news_title_english] => Havent Checked Virat Kohlis Palm says Sunil Gavaskar [news_short_description] => ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ జట్టేదో చెప్పేందుకు మాజీ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ నిరాకరించారు. ఆతిథ్య ఇంగ్లాండ్‌, పటిష్ఠ టీమిండియాను అందరూ [news_tags_keywords] => virat kohli,Sunil Gavaskar,worldcup 2019 [news_bulletpoints] => ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ ఎవరు? [news_bulletpoints_html] =>

ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ ఎవరు?

[news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-03-15 23:41:00 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నేనింకా విరాట్‌ జాతకం చూడలేదు: గావస్కర్‌ - Havent Checked Virat Kohlis Palm says Sunil Gavaskar - EENADU
close

తాజా వార్తలు

నేనింకా విరాట్‌ జాతకం చూడలేదు: గావస్కర్‌

ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ ఎవరు?

దిల్లీ: ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ జట్టేదో చెప్పేందుకు మాజీ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ నిరాకరించారు. ఆతిథ్య ఇంగ్లాండ్‌, పటిష్ఠ టీమిండియాను అందరూ ఫేవరెట్‌ అంటున్నారని ప్రశ్నించగా తానింకా విరాట్‌ కోహ్లీ చేతి రేఖలు చూడలేదని పేర్కొన్నారు. భారత్‌ మరోసారి ప్రపంచ ట్రోఫీని ముద్దాడితే చూడాలని ఉందని వెల్లడించారు.

‘ఈ ప్రశ్నకు సంతోషంగా సమాధానం చెప్పాలని ఉంటుంది. (కానీ) దురదృష్టవశాత్తు నేను విరాట్‌ కోహ్లీ హస్తరేఖలు చూడలేదు. నేనీ ప్రశ్నకు జవాబు చెప్పలేను. భారత్‌ విశ్వవిజేతగా అవతరించాలని కోరుకుంటున్నా’ అని గావస్కర్‌ అన్నారు. మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అన్ని జట్లు ఒకే బంతి ఉపయోగించాలని ఎంసీసీ చేసిన ప్రతిపాదనను సన్నీ తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. ‘బంతిని ప్రమాణీకరించేందుకు ఎంసీసీ ప్రయత్నిస్తోందని తెలిసింది. అలాగే పిచ్‌లను, బ్యాట్‌ను.. ఇలా క్రికెట్లో అన్నింటినీ ప్రమాణీకరించే ప్రయత్నం చేయొచ్చు. ఇలా అందరూ ఒకే పరిస్థితుల్లో ఆడాలంటే.. ఇక విదేశీ పర్యటనలకు అర్థమేముంటుంది’’ అని గావాస్కర్‌ ప్రశ్నించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.