close

తాజా వార్తలు

విద్యుత్‌ తీగ తెగి పడి నిలిచిన పలు రైళ్లు

కేసముద్రం: డోర్నకల్‌-కాజీపేట సెక్షన్‌ మధ్య కేసముద్రం రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఎగువ మార్గంలో 418/27 మైలురాయి వద్ద శనివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఓహెచ్‌ఈ తీగ తెగిపోయింది. దీంతో ఈ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా కేసముద్రం రైల్వేస్టేషన్‌ సమీపంలో గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ 1:30 గంటలు నిలిచిపోయింది. దీంతో పాటు మహబూబాబాద్‌, డోర్నకల్‌లలో పలు రైళ్లను నిలిపివేశారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది ఓహెచ్‌ఈ తీగను మరమ్మతు చేయడంతో రైళ్లు రాకపోకలు యథావిథిగా కొనసాగాయి. ఆ మార్గంలో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.