Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 103333
            [news_title_telugu_html] => 

ఎన్డీయే పార్లమెంటరీ పక్ష నేతగా మోదీ

[news_title_telugu] => ఎన్డీయే పార్లమెంటరీ పక్ష నేతగా మోదీ [news_title_english] => Modi unanimously Elected as NDA Leader [news_short_description] => ఎన్డీఏ పక్షనేతగా జాతీయ ప్రజాస్వామ్య కూటమిలోని ఎంపీలంతా కలిసి మోదీని ఎన్నుకున్నారు. తొలుత మోదీ పేరును అమిత్‌షా ప్రతిపాదించగా.. ఆ ప్రతిపాదనను కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, రాంవిలాస్‌ పాసవాన్‌ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాకరే తదితరులు  బలపరిచారు. [news_tags_keywords] => Modi, Amith shah, NDA Leader, General Elections 2019 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-25 19:28:31 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఎన్డీయే పార్లమెంటరీ పక్ష నేతగా మోదీ - Modi unanimously Elected as NDA Leader - EENADU
close

తాజా వార్తలు

ఎన్డీయే పార్లమెంటరీ పక్ష నేతగా మోదీ

ఎన్డీఏ పక్ష సమావేశంలో ఏకగ్రీవ ఎన్నిక

దిల్లీ: ఎన్డీఏ పక్షనేతగా జాతీయ ప్రజాస్వామ్య కూటమిలోని ఎంపీలంతా కలిసి మోదీని ఎన్నుకున్నారు. తొలుత మోదీ పేరును అమిత్‌షా ప్రతిపాదించగా.. ఆ ప్రతిపాదనను కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ,  రాంవిలాస్‌ పాసవాన్‌ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే తదితరులు  బలపరిచారు. అనంతరం ఎన్డీఏ పక్ష ఎంపీలంతా బల్లలు చరిచి తమ ఆమోదం తెలిపారు. దిల్లీలోని పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో శనివారం ఎన్డీఏ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భాజపా, దాని మిత్రపక్షాలు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా.. ఎన్డీఏ పక్ష నేతలు, ఎంపీలు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘ఆధునిక భారత్‌ దిశగా మనం ప్రయాణం ప్రారంభించాం. ఈ ప్రయాణంలో మీరంతా ఎంతో బాగా సహకరించారు. తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన వారందరికీ అభినందనలు. ఈ ఐదేళ్లలో భారత్‌ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాం. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఈసారి కూడా సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం. భారత ప్రజాస్వామ్యం ఉన్నతి దిశగా పయనిస్తోంది. ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా సేవా భావం మాత్రం మర్చిపోం. ఈ సార్వత్రిక ఎన్నికలు భాజపాకు సానుకూలంగా ఉన్నాయి. మనపై ఈ అనుకూలధోరణి అనేది నమ్మకం అనే దారంతో ముడివేసి ఉంది. ఈ నమ్మకం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉండడమే కాదు.. సాధారణంగా జనంలోనూ ఉంటుంది.’’

ప్రపంచమంతా సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌..
‘‘ఈ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు కూడా కష్టపడ్డారు. ఎండలు వడగాలులను సైతం లెక్కచేయకుండా ప్రజలు ఓటేశారు. ఇంత శాతం ఓటింగ్‌ గతంలో ఎప్పుడూ నమోదు కాలేదు. ఈసారి ఎన్నికల్లో మహిళలు పురుషులతో సమానంగా ఓటేశారు. వచ్చే ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య మరింత పెరుగుతుంది. అదే విధంగా ఈసారి ఎక్కువ మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. 17 రాష్ట్రాల్లో యాభై శాతానికి పైగా ప్రజలు మనల్ని నమ్మి ఓటేశారు. ఎన్డీఏకు దేశ హితమే అన్నింటికంటే ముఖ్యం. ఎన్నికల ప్రచార స్థలాలను పుణ్య స్థలాలుగా భావించా. ఎనర్జీ, సీనర్జీ ద్వారా ఏన్డీఏ ముందుకెళ్తోంది. దేశ సేవ కోసం నా పూర్తి శక్తి సామర్థ్యాలు వినియోగిస్తా. ఈ సేవకుడిపై దేశ ప్రజలు నమ్మకం ఉంచారు. ప్రజల సహకారంతో ఈ దేశాన్ని ప్రగతి బాట పట్టిస్తాం. మన సబ్‌కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌ మంత్రాన్ని ప్రపంచమంతా అనుసరిస్తోంది.’’ అని మోదీ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏలోని పార్టీ నేతలందరికీ శుభాభినందనలు తెలిపారు. భారత్‌లో క్లిష్టమైన ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం విజయవంతంగా నిర్వహించిందని కొనియాడారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.