Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 109738
            [news_title_telugu_html] => 

ఒకేరోజు.. 2.78 లక్షల మంది!

[news_title_telugu] => ఒకేరోజు.. 2.78 లక్షల మంది! [news_title_english] => [news_short_description] =>  మెట్రోలో శుక్రవారం రికార్డు స్థాయిలో ప్రజలు ప్రయాణించారు. 2.78 లక్షల మంది రాకపోకలు సాగించారు. మెట్రో ప్రారంభమయ్యాక ఇప్పటివరకు ... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-09 10:51:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఒకేరోజు.. 2.78 లక్షల మంది! - EENADU
close

తాజా వార్తలు

ఒకేరోజు.. 2.78 లక్షల మంది!

మెట్రోలో రికార్డుస్థాయిలో ప్రయాణం

హైదరాబాద్‌: మెట్రోలో శుక్రవారం రికార్డు స్థాయిలో ప్రజలు ప్రయాణించారు. 2.78 లక్షల మంది రాకపోకలు సాగించారు. మెట్రో ప్రారంభమయ్యాక ఇప్పటివరకు ఇదే అత్యధిక సంఖ్య కావడం విశేషం. ఇటీవల వరకు వారానికి 4వేల మంది ప్రయాణికులు సగటున పెరగ్గా.. ఈ సంఖ్య తాజాగా 5వేలకు చేరింది.

సగం మంది కార్డుపైన..
మెట్రోలో ప్రయాణం చేసేవారిలో సగం మంది టోకెన్లు కొనుగోలు చేస్తుంటే.. మరో సగం మంది స్మార్ట్‌ కార్డు వినియోగిస్తున్నారు. టోకెన్లుకొని శుక్రవారం 1.39 లక్షల మంది ప్రయాణించగా.. ఇదే స్థాయిలో స్మార్ట్‌కార్డుతోనూ ప్రయాణించారు. షటిల్‌ బస్సు సర్వీసుల అనుసంధానంతో ఆదరణ క్రమక్రమంగా పెరుగుతోందని మెట్రో రైల్‌ అధికారులు వివరిస్తున్నారు.

గంటకు 4వేలు..
ఉదయం, సాయంత్రం రద్దీవేళల్లో కొన్ని స్టేషన్లలో రద్దీ అధికంగా ఉంటుంది. హైటెక్‌సిటీ, ఎల్‌బీనగర్‌, మియాపూర్‌ స్టేషన్లలో గంటకు 4వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. టోకెన్ల కోసం జనం బారులు తీరి కనబడుతున్నారు. ఉదయం హైటెక్‌సిటీ వైపు రద్దీ ఉంటే.. సాయంత్రం హైటెక్‌సిటీ నుంచి ఇతర మార్గాలకు ప్రయాణికుల రద్దీ ఉంటోందని ఎల్‌ అండ్‌ టీ మెట్రో వర్గాలు తెలిపాయి.

ప్రయాణికులు పెరగడానికి కారణాలు..
జూన్‌ నెల వచ్చినా ఎండలు ఎక్కువగా ఉండటతో మెట్రోలో ఏసీ ప్రయాణం వైపు మొగ్గుచూపడంతో ప్రయాణికులు పెరుగుతున్నారు.
హైటెక్‌సిటీ మార్గం ప్రారంభం కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే ఐటీ ఉద్యోగులు మెట్రోను ఎంచుకుంటున్నారు.
పనిదినాల్లో ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా మెట్రో రైల్‌ను ఆశ్రయిస్తున్నారు.
దూర ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్‌, రైల్వేస్టేషన్లలో దిగిన ప్రయాణికులు మెట్రోలో గమ్యస్థానాలకు చేరుకోవడానికి మొగ్గుచూపుతున్నారు.
సెలవు మరుసటి రోజు ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
దుర్గం చెరువు, హైటెక్‌సిటీ స్టేషన్ల నుంచి షటిల్‌ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడం, వేర్వేరు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు షటిల్‌ సర్వీసులు నడుపుతుండటంతో ఉద్యోగులు మెట్రోలో వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
రోజూవారీ సగటు

ప్రయాణికులు 2.65 లక్షలు
శని, ఆదివారాల్లో సగటు 2.10 లక్షలు

ఆదరణ ఎక్కడెక్కడంటే..
మెట్రో స్టేషన్లలోని రెస్టారెంట్లు, షాపింగ్‌ కోసం సందర్శకులు పెద్దసంఖ్యలో వస్తున్నారని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. స్టేషన్ల వారీగా రోజుకు రాకపోకలు సాగించే వారి సంఖ్య ఇలా ఉంది..
అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌ 19వేల మంది
హైటెక్‌సిటీ - 18వేలు
ఎల్‌బీనగర్‌ 16వేలు
మియాపూర్‌ 14వేలు
కేపీహెచ్‌బీ 13వేలు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.