close

తాజా వార్తలు

రాయుడి వీడ్కోలు: సెలక్టర్లపై గంభీర్‌ విమర్శలు

ముంబయి: తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడు ఆటకు వీడ్కోలు పలకడం భారత క్రికెట్‌కు బాధాకరమని మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ అన్నారు. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ బృందాన్ని తీవ్రంగా విమర్శించారు. బృందంలోని ఐదుగురి మొత్తం స్కోరు అంబటి పరుగులకు సమానం కావని వెల్లడించారు. కారణాలేవీ వ్యక్తం చేయకుండానే రాయుడు బుధవారం అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. స్టాండ్‌బైగా ఉన్నప్పటికీ ప్రపంచకప్‌నకు ఎంపిక చేయకపోవడమే అతడి అసంతృప్తికి కారణమని చాలామంది భావిస్తున్నారు. గాయపడ్డ విజయ్ శంకర్ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

‘నా వరకైతే, ఈ ప్రపంచకప్‌ను సెలక్టర్లు పూర్తి నిరాశాజనకంగా మార్చారు. వారి వైఖరే రాయుడి వీడ్కోలుకు కారణం. సెలక్టర్ల నిర్ణయ నైపుణ్యాలను నిందించి తీరాల్సిందే. ఆ ఐదుగురు మొత్తం చేసిన స్కోరు రాయుడు చేసిన పరుగులకు సమానం కాదు. అతడి వీడ్కోలుకు చాలా బాధపడుతున్నా. ప్రపంచకప్‌లో గాయపడ్డ వారి స్థానాల్లో రిషభ్‌పంత్‌, మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. రాయుడి స్థానంలో ఉన్న ఎవరైనా ఇందుకు కచ్చితంగా బాధపడతారు. అతడు ఐపీఎల్‌, జాతీయ స్థాయిలో అద్భుతంగా ఆడాడు. మూడు శతకాలు, 10 అర్ధశతకాలు సాధించాడు. అలాంటి ఆటగాడు మధ్యలోనే వీడ్కోలు పలకడం భారత క్రికెట్‌కు కచ్చితంగా బాధాకరం’ అని గంభీర్‌ అన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.