
తాజా వార్తలు
న్యూదిల్లీ: పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం.. సూట్‌కేసుతో కాకుండా ఒక ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్ పత్రాలను ఉంచి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పందిస్తూ ఎద్దేవా చేశారు. ‘‘భవిష్యత్తులో మా కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఐ-ప్యాడ్ తీసుకొస్తారు’’ అని చురకలంటించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘చప్పగా’ ఉందని ఆయన విమర్శలు గుప్పించారు.
‘‘ఎన్నో ఆశలతో ప్రజలు ఎదురుచూస్తే కేంద్ర ఆర్థిక మంత్రి మాత్రం సమాజంలోని ఏ వర్గం వారికీ సమస్యల నుంచి ఉపశమనం కలిగించే విధానాలను ప్రకటించలేదు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కూడా లాగేసుకునేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. ఇది సహకార సమాఖ్య విధానం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న అసమాన భాగస్వామ్య తీరులా ఇది ఉంది. తాను, తన ప్రభుత్వం మాత్రమే ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చగలమని ప్రధాని మోదీ అనుకుంటున్నారు. దీన్ని మేము ఒప్పుకోము. ప్రజలకు కావలసిన వస్తువులను, సేవలను అందించే సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది’’ అని చిదంబరం విమర్శించారు.
‘‘ఈ బడ్జెట్ చప్పగా ఉంది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దడానికి లక్ష్యం పెట్టుకున్నారు. అయితే, ప్రయివేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించడానికి మాత్రం బడ్జెట్లో ఎటువంటి సూచనలు లేవు. దేశంలోని పన్ను చెల్లింపుదారులపై భారాన్ని పెంచారు. చాలా వస్తువులపై కస్టమ్స్ సుంకాలు పెంచారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులు పెంచారు. తాము ఎన్పీఏలను రూ.లక్ష కోట్లకు తగ్గించామని ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు. మరి ఇదే సమయంలో రూ.5,55,603 కోట్ల మొండి బకాయిల ఖాతాలను ఎందుకు రద్దు (రైటాఫ్) చేశారన్న విషయాన్ని కూడా ఆమె చెప్పాల్సింది. ఈ విషయం ఎందుకు చెప్పలేదు?’’ అని చిదంబరం విమర్శించారు. దేశంలోని సాధారణ ప్రజలు, నిష్ణాతులైన ఆర్థికవేత్తల అభిప్రాయాలు వినకుండానే బడ్జెట్‌ను రూపొందించారని అన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- చైనా సూర్యుడు
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- హైదరాబాద్‌లో విద్యార్థుల ఆందోళన
- జపాన్‌లో రానా బర్త్‌డే సెలబ్రేషన్స్
- చిన్నోడికి.. పెద్ద కష్టం..
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
