close

తాజా వార్తలు

టచ్‌ ఫోన్‌ కొనివ్వలేదని.. భార్యను హత్య చేసిన భర్త

 అదనపు కట్నం కోసం వేధింపులు
ఒళ్లంతా గాయాలే-సిగరెట్లతో కాల్చాడు

కడప నేరవార్తలు: అయిదు వేల రూపాయలు విలువ చేసే టచ్‌ ఫోన్‌ తీసివ్వలేదని భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు.. ఒళ్లంతా సిగరెట్టుతో కాల్చాడు.. పది రోజుల నుంచి నరకం చూపించి పొట్టపబెట్టుకున్నాడా కర్కోటకుడు.. గర్భవతి అని తెలిసి కూడా చిత్రహింసలకు గురిచేశాడు. చరవాణితో పాటు అదనపు కట్నం తీసుకు రావాలని వేధించాడు. శుక్రవారం రాత్రి తీవ్రస్థాయిలో భార్యను కొట్టడంతో ఆమె ఇంట్లోనే కుప్పకూలిపోయింది. భార్య శవాన్ని గదిలో వేసి పారిపోయాడు. శనివారం ఉదయం బంధువులు, స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఆమె శవమై కన్పించింది. విషయం తెలుసుకున్న కడప డీఎస్పీ సూర్యనారాయణ ఘటన స్థలికి వచ్చి పరిశీలించారు. డీఎస్పీ అందించిన సమాచారం మేరకు వివరాలివి.. కడప అల్లూరి సీతారామరాజునగర్‌కు చెందిన చాందిని (22)కి అదే ప్రాంతానికి చెందిన మారుతీతో కొంత కాలం క్రితం వివాహమైంది. వివాహ సమయంలో కట్నకానుకల కింద రూ.4 లక్షలు ఇచ్చారు. మారుతీ ముస్లిం అయినప్పటికీ అతని తల్లిదండ్రులు హిందువుల పేరు పెట్టారు. మారుతీ దుకాణాల వద్దకు వెళ్లి సాంబ్రాని వేసి నాలుగు డబ్బులు సంపాదించే వాడు. వీరికి వల్లీ (4) అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం చాందిని రెండు నెలల గర్భవతి. పెళ్లైనప్పటి నుంచి అధిక కట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేస్తుండే వాడు. ప్రతి నెలా ఇంటి నుంచి ఎంతో కొంత తీసుకుని రావాలని భార్యపై ఒత్తిడి తీసుకొచ్చేవాడు. పది రోజుల నుంచి వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. భర్తతో పాటు అత్తా, మామ, ఆడ బిడ్డ కూడా హింసించే వారు. సిగరెట్లతో కాల్చేవాడు. కొద్ది రోజుల కిందట టచ్‌ ఫోన్‌ కావాలని భార్యను అడిగాడు. తొందరలో అమ్మను డబ్బులు అడిగి కొనిస్తానని భార్య చెప్పిందని డీఎస్పీ తెలిపారు. చరవాణి కొనివ్వలేదని మనసులో పెట్టుకుని రెండు రోజుల కిందట భార్యను కొట్టడంతో చెయ్యి విరిగింది. శుక్రవారం రాత్రి భార్యను తీవ్రస్థాయిలో కొట్టడంతో పాటు కత్తితో ఒంటిపై గాయపరిచాడు.. దెబ్బలకు తట్టుకోలేక ఆమె చనిపోయింది. విగతజీవిగా ఉన్న భార్యను చూసి శవాన్ని గదిలో పెట్టి భర్త, అత్తా, మామ, ఆడబిడ్డ ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి ఉడాయించారు. శనివారం ఉదయం బంధువులు, స్థానికులు వెళ్లి చూడగా చాందిని రక్తపుమడుగులో ఉంది. బిడ్డ మృతదేహాన్ని చూసి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. మృతురాలి తల్లి ఖాసింబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్తా, మామ, ఆడబిడ్డపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.