close

తాజా వార్తలు

భారత్‌కు దీటుగా బదులిస్తున్న సఫారీలు

శతకాలు సాధించిన ఎల్గర్, డికాక్‌
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 385/8
ఐదు వికెట్లతో సత్తా చాటిన అశ్విన్‌

విశాఖపట్నం: విశాఖ వేదికగా జరుగుతున్న భారత్‌×దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టీమ్‌ ఇండియాకు సఫారీలు దీటుగా సమాధానమిస్తున్నారు. ఓపెనర్ ఎల్గర్ (160, 287 బంతులు; 18 ఫోర్లు, 4 సిక్సర్లు), వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ ( 111, 163 బంతులు; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలతో కదం తొక్కగా తొలి పోరు ఆసక్తికరంగా మారింది. మూడో రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా 385/8తో పోటీలో నిలిచింది. భారత స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్ (128/5) ఐదు వికెట్లతో సత్తా చాటాడు.

ఆదిలోనే బవుమా ఔట్‌
ఓవర్‌నైట్‌ స్కోరు 39/3తో ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికాను ఇషాంత్‌శర్మ ఆదిలోనే దెబ్బ తీశాడు. బవుమా (18)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సారథి డుప్లెసిస్‌ (55, 103 బంతులు; 8 ఫోర్లు, సిక్సర్)తో కలిసి ఎల్గర్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ సమన్వయంతో ఆడుతూ ఐదో వికెట్‌కు 115 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని రవిచంద్రన్‌ అశ్విన్‌ విడదీశాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడటానికి ప్రయత్నించిన డుప్లెసిస్‌ లెగ్‌స్లిప్‌లో ఉన్న పుజారా చేతికి చిక్కాడు. దీంతో 178 పరుగులకే దక్షిణాప్రికా సగం వికెట్లు కోల్పోయింది. 


ఆదుకున్న ఎల్గర్‌-డికాక్‌
అనంతరం క్రీజులోకి వచ్చిన డికాక్‌తో కలిసి ఎల్గర్ భారత బౌలర్లును సమర్థంగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ చెత్త బంతుల్ని బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముచ్చటైన షాట్లతో అలరిస్తూ ఎల్గర్‌ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. డికాక్‌ కూడా తనదైన శైలిలో చెలరేగడంతో పరుగులు పోటెత్తాయి. కానీ, ఎల్గర్‌ను జడేజా బోల్తా కొట్టించి వీరిద్దరి భాగస్వామ్యానికి తెరదించాడు. డికాక్‌-ఎల్గర్‌ ఆరో వికెట్‌కు 164 పరుగులు జోడించారు.

ఎల్గర్ ఔటైన కొద్దిసేపటికే డికాక్‌ సెంచరీ సాధించాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ను బాది శతకాన్ని అందుకున్నాడు. తర్వాత డికాక్‌ను అశ్విన్‌ అద్భుతమైన బంతితో క్లీన్‌బోల్డ్‌ చేశారు. ఫిలాండర్‌ను కూడా అతడు పెవిలియన్‌కు పంపించడంతో ఆఖరి సెషన్‌లో సఫారీలు మూడు వికెట్లు కోల్పోయారు. ప్రస్తుతం క్రీజులో ముత్తుస్వామి (12*), మహారాజ్‌ (3*) ఉన్నారు. భారత్‌ కంటే దక్షిణాఫ్రికా ఇంకా 117 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో అశ్విన్‌ ఐదు వికెట్లు, జడేజా రెండు, ఇషాంత్ శర్మ ఒక్క వికెట్‌ పడగొట్టాడు.

స్కోరు వివరాలు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 502/7 డిక్లేర్‌ (మయాంక్‌ 215, రోహిత్‌ 176; మహారాజ్‌ 189/3)
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 358/8 (ఎల్గర్‌ 160, డికాక్‌ 111, అశ్విన్‌ 128/5)



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.