
తాజా వార్తలు
డార్ట్ఫోర్డ్: యునైటెడ్ కింగ్డమ్లోని కెంట్లోని డార్ట్ఫోర్డ్ నగరంలో ఫీనిక్స్ క్వార్టర్స్ రెసిడెంట్స్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు దసరా సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. 150 మందికి పైగా భారతీయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సంబరాల్లో భాగంగా పూలతో అలంకరించిన ఫొటోబూత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు, పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సంప్రదాయ పద్ధతిలో పండుగను జరుపుకున్నారు. భారతీయ మూలాలు మర్చిపోకుండా భవిష్యత్ తరానికి భారతీయ సంప్రదాయాలు తెలిసేలా బతుకమ్మను చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కార్యక్రమంలో పాల్గొన్న వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరినీ అలరించాయి. ఈ వేడుకలను నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించిన కమ్యూనిటీ ఆర్గనైజింగ్ బృందం, వాలంటీర్స్ అందరికీ ఫీనిక్స్ క్వార్టర్స్ రెసిడెంట్స్ కమ్యూనిటీ వాలంటీర్ కృష్ణ పవన్ చల్ల కృతజ్ఞతలు తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఈ డెబిట్కార్డులను బ్లాక్ చేయనున్న ఎస్బీఐ..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
