close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. వాణిజ్యంపై చర్చ

ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ మామల్లాపురంలో ప్రధానంగా వాణిజ్య సంబంధ అంశాలపై చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య పరిమాణాన్ని మరింత పెంచుకోవడంపై సమాలోచనలు జరిపారు. ఇంకా ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టొచ్చో వారు గుర్తించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి అంశాలు కూడా వారి చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఈ మేరకు మోదీ, జిన్‌పింగ్‌ల చర్చల వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖలే విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఇంటింటికీ క్యాన్సర్‌ పరీక్షలు

రాష్ట్రంలో ఇప్పటికే ‘కంటివెలుగు’ ద్వారా కళ్లకు సంబంధించిన చికిత్సలను అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరోగ్య సంరక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో మొత్తం క్యాన్సర్‌ కేసుల నమోదును పరిశీలిస్తే అత్యధికంగా దాదాపు 60 శాతానికి పైగా గర్భాశయ ముఖద్వార, రొమ్ము క్యాన్సర్‌లే నమోదవుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో నోటి క్యాన్సర్‌ కేసులున్నాయి. వీటిని తొలిదశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాపాయ ముప్పును తప్పించవచ్చనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ‘ఇంటింటికీ క్యాన్సర్‌ పరీక్షల’ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. రూ.46,675 కోట్లతో వాటర్‌గ్రిడ్‌

రాష్ట్ర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేలా సుమారు రూ.46,675 కోట్ల అంచనాలతో వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. మొదటి దశలో 37,475 కోట్లు, రెండో దశలో మరో 9,200 కోట్లు వెచ్చించనుంది. ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) నుంచి ప్రభుత్వం రూ.2,500 కోట్ల రుణం తీసుకుంటుంది. ప్రాజెక్టు పూర్తయితే 46,982 గ్రామీణ ఆవాస ప్రాంతాలకు, మరో 99 పట్టణ ప్రాంతాలకు తాగునీరు అందుబాటులోకి రానుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

4. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న ఎస్సీ వసతి గృహాల విలీనం

విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ఎస్సీ విద్యార్థుల వసతి గృహాలను మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో వసతి గృహంలో 100 మందికి తక్కువగా విద్యార్థులు ఉన్నవాటిని తొలి విడత లక్ష్యంగా పెట్టుకుంది. వీటిని వచ్చే విద్యాసంవత్సరానికి సమీపంలోని ఇతర వసతి గృహాల్లో విలీనం చేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. జగన్‌ అహంకారం.. రాష్ట్రానికి నష్టం

ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. శుక్రవారం విశాఖ జిల్లాలోని నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లో రెండో రోజు ఆయన నగర పరిధిలోని ఏడు నియోజకవర్గాల కార్యకర్తలతో మాట్లాడారు. జగన్‌ అహంకారం రాష్ట్రాన్ని తిరోగమనంలోకి నెట్టుతోందని ఆరోపించారు. తనకు స్వాగతం పలికేందుకు విశాఖ విమానాశ్రయానికి వస్తున్న కార్యకర్తలను అడ్డుకున్నారని, దీనిపై ప్రశ్నించిన ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం ప్రజావ్యతిరేకమని అభివర్ణించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. తెదేపా నిర్వాకం వల్లే ఆర్థిక దుస్థితి

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై క్రిసిల్‌, బ్రిక్‌వర్క్‌ సంస్థలు ఇచ్చిన రేటింగ్‌ గత ప్రభుత్వ నిర్వాకం ప్రభావమేనని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని మాజీ సీఎం చంద్రబాబు, ఆర్థికశాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించటాన్ని ఆయన తప్పుబట్టారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర విద్యుత్తు ఆర్థిక సంస్థ లిమిటెడ్‌కు (ఏపీపీఎఫ్‌సీఎల్‌) బ్యాంకు రుణం కోసం ప్రభుత్వ గ్యారంటీపై ఎస్‌బీఐ అనుమానం వ్యక్తం చేసింది. ఇది రహస్య పత్రం. బయటకు ఎలా వచ్చిందనే అంశంపై విచారణ జరిపిస్తాం’ అని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. స్థానికత గడువు మరో రెండేళ్లు పెంపు

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చే వారికి స్థానికత కల్పించడానికి ఇప్పటివరకూ ఉన్న ఐదేళ్ల గడువును ఏడేళ్లకు పెంచుతూ కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం నవ్యాంధ్రప్రదేశ్‌ ఏర్పడిన 2014 జూన్‌ 2 నుంచి ఏడేళ్లలోపు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చిన వారు అక్కడ స్థానికత పొందడానికి వీలవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. హైదరాబాద్‌లో భారీ వర్షం

9. చొరబాటు యత్నాల్లో ఉగ్రవాదులు!

నియంత్రణ రేఖ వెంబడి ఉన్న శిక్షణ శిబిరాల్లో దాదాపు 500మంది ఉగ్రవాదులు  కశ్మీర్‌లో చొరబడేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని భారత సైనికాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు జమ్మూ-కశ్మీర్‌లో 200-300 మంది ఉగ్రవాదులు పాక్‌ సహకారంతో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఉత్తర కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రణబీర్‌ సింగ్‌ విలేకరులకు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. మహిళల క్రికెట్‌: రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై విజయం

భారత మహిళల క్రికెట్‌ జట్టు మరోసారి అదరగొట్టింది. దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో నెగ్గిన టీమ్‌ఇండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (66; 82 బంతుల్లో 8×4)తో పాటు పూనమ్‌ రావత్‌ (65; 92 బంతుల్లో 7×4) అర్ధశతకాలతో సత్తాచాటడంతో 5 వికెట్లు కోల్పోయి 48వ ఓవర్లో లక్ష్యాన్ని అందుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.