close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. సమ్మె కొనసాగుతుంది: అశ్వత్థామరెడ్డి

ప్రభుత్వం పిలిచినా, యాజమాన్యం పిలిచినా తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేత అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతానికి సమ్మె యథావిధిగా కొనసాగుతుందని  స్పష్టం చేశారు. ప్రభుత్వం మైండ్‌గేమ్‌ ఆడుతోందని, ఎంపీ కేకే సహా ఎవరూ తమతో మాట్లాడలేదన్నారు. అన్ని విషయాలు ఈనెల 18న తమ న్యాయవాది ద్వారా హైకోర్టుకు వివరిస్తామని  తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఏపీని దక్షిణాది బిహార్‌గా మార్చారు: చంద్రబాబు

రాష్ట్రంలో గుత్తేదారులు, పెట్టుబడిదారులను వైకాపా నేతలు బెదిరిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రాజెక్టుల్లో రివర్స్‌ టెండరింగ్‌ పేరిట మోసాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నెల్లూరులో నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమీక్షల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ విధానాలు అరాచకానికి పరాకాష్ఠగా మారాయని ఆక్షేపించారు. దక్షిణాది బిహార్‌గా రాష్ట్రం తయారైందని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. చిదంబరం అరెస్టుకు ఈడీకి అనుమతి

మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు కోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసులోని మనీలాండరింగ్‌ వ్యవహారంలో దర్యాప్తు కోసం చిదంబరాన్ని తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ దిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇందుకు కోర్టు మంగళవారం అంగీకరించింది. తాజా తీర్పు నేపథ్యంలో ఈడీ అధికారులు బుధవారం చిదంబరాన్ని తీహాడ్‌ జైలులో ప్రశ్నించనున్నారు. అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఆ నీళ్లు పాక్‌కు ఇవ్వం:మోదీ

ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో అనేక అపోహలు రేకెత్తిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. హరియాణాలో రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ చర్కీ దాద్రి జిల్లాలో ప్రసంగించారు. గత 70 ఏళ్లుగా హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల రైతులకు చెందిన నీరు పాకిస్థాన్‌కు పోతోందన్నారు. ఇది ఇక్కడితో ఆపేద్దాం. ఇకపై పాకిస్థాన్‌కు నీటిని పంపించే ప్రసక్తే లేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఈ ఏడాది ఆ నోట్లుఒక్కటీ ముద్రించలేదు:ఆర్బీఐ

భారతీయ రిజర్వ్‌ బ్యాంకు నోట్‌ ముద్రణ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో  ఒక్క రూ.2000 నోటునూ ముద్రించలేదని ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. ఓ వార్త ప్రసార సంస్థ  అడిగిన ప్రశ్నకు సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలను ఆర్‌బీఐ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ప్రధాని మోదీతో తమిళిసై భేటీ

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో గవర్నర్‌ భేటీ అయ్యారు. తమిళిసై గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ప్రధానికి వివరించినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఈ ప్రభుత్వంతో సామాన్యులకు ప్రయోజనంలేదు

ప్రధాని నరేంద్రమోదీ దేశంలోని కొంత మంది పెద్ద పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. ప్రజలను మభ్యపెడుతున్నారని రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లాలో ప్రసంగించారు. కార్పొరేట్‌ పన్నును మాఫీ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల రాహుల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని వల్ల కొంత మంది పెద్ద వ్యాపారవేత్తలు లాభపడ్డారే తప్ప సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. కేంద్ర మాజీ మంత్రిప్రఫుల్‌ పటేల్‌కు ఈడీ సమన్లు

కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సన్నిహితుడైన ఇక్బాల్‌ మిర్చి భార్య నుంచి ఆస్తులకు సంబంధించి ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలపై ఆయన్ను విచారించనుంది. ఈ మేరకు ఈ నెల 18న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ నెల 21న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. 18 వ తేదీన విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ప్రఫుల్‌ పటేల్‌ను కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఆ మాజీ ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోండి

పదవీ కాలం ముగిసినా ఇంకా అధికారిక బంగళాల్లోనే నివాసముంటున్న మాజీ ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ కమిటీ ఆదేశించింది. ఇందుకోసం దిల్లీ పోలీసుల సహకారం కోరాలని నిర్ణయించింది. ఇంకా ఖాళీ చేయని మాజీ ఎంపీల ఇళ్లకు గ్యాస్‌, విద్యుత్తు, నీటి సరఫరా తక్షణం నిలిపివేయాలని అధికారులకు సూచించింది. తాజాగా ఎన్నికైన ఎంపీలు పలుమార్లు అధికారిక నివాసాలు కోరుతున్నా.. ఖాళీ లేనందున వారికి కేటాయించలేకపోతున్నామని కమిటీ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. రవిప్రకాష్‌ మీడియా హౌస్‌పై ఫిర్యాదు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు చెందిన రవిప్రకాష్‌ మీడియా హౌస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. రవిప్రకాష్‌కు చెందిన వెబ్‌ఛానెల్స్‌లో తనపై అసత్యప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రవిప్రకాష్‌పై తాను ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా... తప్పుగా ఫిర్యాదు చేసినట్లు వెబ్‌ఛానెల్స్‌ అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.