close

తాజా వార్తలు

పేడతో కొట్టుకోవడం వాళ్లకో సరదా!

కర్ణాటకలో చిత్రమైన వేడుక

కర్ణాటక: సంక్రాతికి తమిళనాడులో జల్లికట్టు, దసరాకు కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం ఇలా వివిధ పండగల సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగే విభిన్న ఉత్సవాలివి. అయితే ఏ పండగా లేకుండానే కర్ణాటకలోని ఓ గ్రామంలో మరో చిత్రమైన వేడుక జరుగుతోంది. ఏటా నవంబరు మాసంలో జరిగే ఈ వేడుకలో గ్రామస్థులు పేడతో పరస్పరం కొట్టుకుంటారు. కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లా గుమటపురం గ్రామంలో బుధవారం ఈ విచిత్ర వేడుక జరిగింది. గ్రామంలోని ఆలయంలో పూజలు నిర్వహించిన తరువాత గ్రామస్థులు ఒకరిపై ఒకరు ఆవు పేడను విసురుకున్నారు.కేవలం ఆరోగ్యం కోసమే తాము ఈ పేడోత్సవాన్ని నిర్వహిస్తామని గుమటపురం గ్రామస్థులు తెలిపారు.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.