
తాజా వార్తలు
వాషింగ్టన్: కొంతకాలంగా వేచిచూస్తున్న అమెరికాతో వాణిజ్య ఒప్పందం చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పందానికి తుది రూపునిచ్చేందుకు వచ్చే వారం అమెరికా ప్రతినిధులు భారత్‌కు రానున్నారు. నవంబరు 12న పీయూష్ గోయల్ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు అక్కడి ప్రతినిధి రాబర్ట్ లైట్హైజర్తో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఒప్పందంలో సంక్లిష్టంగా మారిన అనేక అంశాలపై ఓ అవగాహన కుదిరినట్లు సమాచారం. అలాగే అక్కడి పారిశ్రామిక వర్గాలతోనూ శుక్రవారం గోయల్ భేటీ కానున్నారు.
గత జూన్‌లో భారత్‌ను ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ) జాబితా నుంచి అమెరికా తొలగించిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు చెందిన ఉత్పత్తులపై అగ్రరాజ్యం అధిక సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య విభేదాలు తెలెత్తాయి. దీనిపై ఉభయ దేశాల వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో వీటి పరిష్కారం దిశగా రెండు దేశాల ప్రతినిధులు, మంత్రులు విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే దీనిపై ఓ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
