close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. డిపోలకు కార్మికులు.. అడ్డుకుంటున్న పోలీసులు

తెలంగాణ ఆర్టీసీ ఐకాస పిలుపు మేరకు సమ్మె విరమించి, విధుల్లోకి చేరేందుకు డిపోలకు వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆర్టీసీ యాజమాన్యం అనుమతి లేనందువల్ల విధుల్లో చేరడం కుదరదంటూ కార్మికులను వెనక్కిపంపిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఆర్టీసీ ఐకాస నేతల ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు.. వారిని  ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ససేమిరా చేర్చుకోం

కార్మికులు తమంతట తాముగా సమ్మెకు దిగి, ఇప్పుడు మళ్లీ విధుల్లోకి చేరతామనటం చట్టప్రకారం కుదరదని ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ పేర్కొన్నారు. ఇలా ఆర్టీసీ ఐకాస ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తాము సమ్మె విరమిస్తున్నట్లు, మంగళవారం నుంచి విధుల్లో చేరనున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సునీల్‌శర్మ ఒక ప్రకటన విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. నేడు 70వ రాజ్యాంగ దినోత్సవం

భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 70 ఏళ్లు అవుతున్న సందర్భంగా... మంగళవారం పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్‌ దివస్‌) జరుగనుంది. రాజ్యసభ 250వ సమావేశాలకు గుర్తుగా రూపొందించిన రూ.250 విలువైన వెండి నాణేన్ని... ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి  వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. నేడు ‘మహా’తీర్పు

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దుమారంపై మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలో సర్కారు ఏర్పాటుకు గవర్నర్‌ అవకాశం ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఎదుట సోమవారం వాదనలు ముగిశాయి. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించే అంశంపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. నేటి నుంచి పీఎస్‌ఎల్‌వీ కౌంట్‌డౌన్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి రోదసీలోకి ఒకేసారి 14 ఉపగ్రహాల్ని పంపేందుకు సిద్ధమైంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక ఇందుకు సిద్ధమైంది. చంద్రయాన్‌-2 తర్వాత ఇస్రో చేస్తున్న మొదటి ప్రయోగమిది. సోమవారం ఉదయం పది గంటలకు రిహార్సల్‌ను విజయవంతంగా ముగించారు. అనంతరం ఆబార్డ్‌ టెస్టు నిర్వహించారు. ఇవాళ ఉదయం 7.28 గంటలకు ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. అవినీతిపై ఫిర్యాదులకు.. 14400

అవినీతిపై ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కాల్‌ సెంటర్‌ నంబరు 14400ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం దీన్ని ప్రారంభించారు. ఫిర్యాదు అందిన 15 నుంచి 30 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. రాజధాని నిర్మాణాలు ఆపొద్దు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతుల పనుల్ని కొనసాగించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పచ్చజెండా ఊపారు. ఆర్భాటాలకు వెళ్లకుండా, అనవసర ఖర్చులు తగ్గించుకుని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాజధాని పనులపై సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో సీఎం జగన్‌ సోమవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. అన్నా హజారే బాటలో స్వీడన్‌

జలసంరక్షణకు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చూపించిన మార్గాన్ని ఇప్పుడు స్వీడన్‌ దేశం అనుసరించనుంది. భూగర్భ జలవనరుల పెంపునకు భారతీయ సంప్రదాయ పద్ధతులను పాటించనుంది. బాల్టిక్‌ సముద్రంలోని సదరన్‌ గోట్‌లాండ్‌ దీవిలో ఉన్న స్టోర్సుడెర్ట్‌ పట్టణంలో చెక్‌డ్యాంలు, చెరువుల వంటి నిర్మాణాలతో నీటి కొరతను అధిగమించాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ప్రపంచంలోనే అతి భారీ కిడ్నీ

ప్రపంచంలోనే అత్యంత పెద్దదిగా, అతి బరువైనదిగా పేర్కొంటున్న మూత్రపిండాన్ని ఓ 56 ఏళ్ల వ్యక్తి నుంచి దిల్లీలోని గంగారాం ఆసుపత్రి వైద్యులు ఇటీవల తొలగించారు. 32×21.8 సెంటీమీటర్లున్న ఈ మూత్రపిండం బరువు 7.4కిలోగ్రాములని వైద్యులు సోమవారం వెల్లడించారు. ఇప్పటిదాకా 4.25 కిలోల బరువున్న కిడ్నీని ప్రపంచంలోనే అతిపెద్దదిగా పేర్కొంటున్నారనీ, ఇప్పుడు తాము తొలగించిన 7.4 కిలోల మూత్రపిండమే అత్యంత పెద్దదని వైద్యులు తెలిపారు.

10. అంకురాలకు వాట్సాప్‌ చేయూత

ఒక్కో సంస్థకు 500 డాలర్ల (దాదాపు రూ.35,840) చొప్పున మొత్తంగా 500 అంకుర సంస్థలకు 2,50,000 డాలర్ల (రూ.1.75 కోట్లు) విలువైన ఫేస్‌బుక్‌ యాడ్‌ క్రెడిట్స్‌ను వాట్సాప్‌ ఇవ్వనుంది. ఈ యాడ్‌ క్రెడిట్స్‌తో.. అంకురాలు ప్రకటనలు రూపొందించుకుని, వాటి ద్వారా వినియోగదార్లను వాట్సాప్‌లో చాట్‌ చేసేలా ఆహ్వానించవచ్చు. తద్వారా అమ్మకాలు పెంచుకోవచ్చు. పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) గుర్తింపు పొంది, ప్రారంభ దశలో ఉన్న అంకురాలు ఈ యాడ్‌ క్రెడిట్స్‌ను పొందే వీలుంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.