close

తాజా వార్తలు

ట్రంప్‌ తెచ్చిన చట్టంతో తంటాలు..!

పుణె: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొచ్చిన ఒక చట్టంతో భారతీయులు హెచ్‌-1బీ వీసాలు పొందడం కష్టంగా మారింది. 2017 ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‘బై అమెరికన్‌..హైర్‌ అమెరికన్‌’ (బీఏహెచ్‌ఏ) చట్టంపై సంతకం చేశారు. అమెరికా స్థానిక వ్యాపారాలను పెంచేందుకు ఈ చట్టాన్ని  ఆయన తీసుకొచ్చారు. ఫలితంగా రెండేళ్లలో భారతీయ కంపెనీలు పొందే హెచ్‌-1బీ వీసాల్లో  గతంతో పోలిస్తే చాలా తగ్గాయి. తొలి పది స్థానాల్లో ఉండే భారతీయ సంస్థలు 2016లో 51శాతం వీసాలు పొందగా.. 2019కి వచ్చేనాటికి ఆ మొత్తం 24శాతానికి పడిపోయిందని అమెరికా సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌ వెల్లడించింది. 
2016, 2017ల్లలో హెచ్‌-1బీ వీసాలు పొందిన తొలి పదికంపెనీల్లో 5 భారత్‌కు చెందినవి ఉన్నాయి. 2019 నాటికి టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ మాత్రమే ఈ జాబితాలో ఉన్నట్లు యుఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది. గతంలో ఏటా  85వేల వీసాలు మాత్రమే ఇచ్చేవారు.. కానీ కొత్త చట్టం వచ్చాక ఆ సంఖ్యను మరింత కుదించారు. ఇక భారత్‌లోని టాప్‌-7 కంపెనీల వీసాల  వాటా కూడా 16 శాతానికి పడిపోయిందని నాస్కామ్‌ ప్రతినిధి శివేంద్ర సింగ్‌ తెలిపారు. భారతీయులకు జారీ చేసిన హెచ్‌-1బీ వీసాల్లో చాలా వరకు అమెరికా కంపెనీలు వెళ్లాయి, అతి తక్కువ మాత్రమే భారతీయ కంపెనీలకు వెళ్లాయి. అమెరికా కంపెనీలు దరఖాస్తు చేసిన వాటిల్లో 99శాతం వీసాలు వచ్చాయి. 
ట్రంప్‌ కార్యవర్గం ముఖ్యంగా సేవా రంగ కంపెనీలనే లక్ష్యంగా చేసుకొని వీసా నిబంధనలను కఠినతరం చేశాయి. కస్టమర్‌ సైట్లలో పనిచేస్తున్న హెచ్‌-1బీ వీసాదారులకు వర్తించే నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ మొత్తం తతంగాన్ని వరుస మెమోలు, సూచనలు, సవరణ రూపంలో  అమల్లోకి తెచ్చింది. 
బీఏహెచ్‌ఏ చట్టాన్ని అమెరికాలో ఉద్యోగాలను పెంచేందుకు ఉద్దేశించి తీసుకొచ్చారు. పైగా జారీ చేసిన హెచ్‌-1బీ వీసాలను చట్టంలోని నిబంధనల ప్రకారం కేటాయించారో లేదో తెలుసుకొనేందుకు హోంల్యాండ్‌ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు, ఇతర ఏజెన్సీలు సాయం తీసుకొనే అవకాశం కూడా కల్పించారు. ఈ చట్టం  ఉద్యోగులు, యాజమాన్యాల మధ్య సంబంధంపై కూడా ప్రభావం చూపిస్తోంది. దీంతోపాటు ఇప్పటికే ఆమోదం పొందిన చాలా వీసాలు మళ్లీ తిరస్కరణకు గురైయ్యాయని ఇమ్మిగ్రేషన్‌ లాయర్లు వెల్లడించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.