close

తాజా వార్తలు

ఒత్తిడిని తరిమేద్దాం

శరీరంలోని వ్యర్థాలను, మనసులోని ఒత్తిళ్లను ఎప్పటికప్పుడు బయటకు పంపేయాలి. లేదంటే పలు రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు జీవనశైలిలోనే కొన్ని మార్పులు చేసుకోవాలి.

* ఉయదంపూట చాలామందికి వ్యాయామం చేసే తీరిక ఉండదు. అందుకే కనీసం సాయంత్రం అయినా వ్యాయామం చేయాలి. అలాగే తోట పనీ, నడక, నృత్యం వంటి వాటకీ ప్రాధాన్యం ఇవ్వాలి. ఒత్తిడి దూరమై... మానసికంగా, శారీరంగా చాలా ఉల్లాసంగా ఉంటుంది.
* కొన్నాళ్లపాటు జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండి చూడండి. జీర్ణవ్యవస్థలోకి వ్యర్థాలు చేరుకోకుండా ఉంటాయి. మెదడు పనితీరు కూడా చురుగ్గా ఉంటుంది.
* మన ఇంట్లో కావచ్చు... ఆఫీసులో పనిచేసే చోట అవ్వొచ్చు. ఎక్కడైనా పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో శుభ్రత వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆఫీసులో పరిశుభ్రత పాటిస్తే మానసిక ప్రశాంతత దక్కుతుంది. ఒత్తిడి దరిచేరదు.
* ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో పది నుంచి పదిహేను నిమిషాల పాటు ధ్యానం చేయాలి. దీనివల్ల శరీరంలోని అన్ని భాగాలకూ ప్రాణవాయువు సరఫరా అవుతుంది. ఈ ప్రకియ శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
* ప్రతి పదిహేను రోజులకోసారి ఓ రోజంతా ఘనాహారం మానేయాలి. కేవలం పండ్ల రసాలు, పండ్లు, పచ్చికూరగాయల్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీర వ్యవస్థ అంతా శుభ్రపడుతుంది. వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
* రోజూ రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల ట్యాక్సిన్లు మూత్రం ద్వారా బయటకు పోతాయి. అలానే ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత లేకుండా మెదడు పనితీరు కూడా బాగుంటుంది. రోజంతా చురుగ్గా పనిచేయగలుగుతారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.