Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142973
            [news_title_telugu_html] => 

కాజల్‌ పాత్ర కట్‌ చేశాం: శర్వానంద్‌

[news_title_telugu] => కాజల్‌ పాత్ర కట్‌ చేశాం: శర్వానంద్‌ [news_title_english] => we are not trying to give a message with ranarangam says sharwanand [news_short_description] => ‘రణరంగం’ సినిమాతో సందేశం ఇవ్వాలనుకోలేదని యువ కథానాయకుడు శర్వానంద్‌ చెప్పారు. ఆయన నటించిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు ... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 00:27:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కాజల్‌ పాత్ర కట్‌ చేశాం: శర్వానంద్‌ - we are not trying to give a message with ranarangam says sharwanand - EENADU
close

తాజా వార్తలు

కాజల్‌ పాత్ర కట్‌ చేశాం: శర్వానంద్‌

మేం సందేశం ఇవ్వాలనుకోలేదు

హైదరాబాద్‌: ‘రణరంగం’ సినిమాతో సందేశం ఇవ్వాలనుకోలేదని యువ కథానాయకుడు శర్వానంద్‌ చెప్పారు. ఆయన నటించిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్‌, కాజల్‌ కథానాయికలుగా నటించారు. శుక్రవారం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శర్వా మాట్లాడుతూ.. తన కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ రాబట్టిన సినిమా ఇదని ఆనందం వ్యక్తం చేశారు.

‘నాకు మంచి ఓపెనింగ్స్‌ తీసుకొచ్చిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. రివ్యూల్లో రాసిన విధానం, నాకు వచ్చిన స్పందన ప్రకారం.. కథ గురించి ఓసారి ఆలోచించి ఉండాలని మీరు (విమర్శకుల్ని ఉద్దేశిస్తూ) అనుకున్నారు. కానీ స్క్రీన్‌ప్లేపై ఆధారపడి ఈ సినిమా తీశాం. ఓ సందేశం ఇవ్వాలని మేం అనుకోలేదు. ఓ స్టైలిష్ యాక్షన్‌ సినిమా తీద్దాం అనుకున్నాం. ఆ విషయంలో మేం 200 శాతం సక్సెస్‌ అయ్యాం. దీని కోసం చాలా మంది కష్టపడ్డారు. మా సినిమాటోగ్రాఫర్‌ దివాకర్‌ ది బెస్ట్‌ ఇచ్చారు. కళా దర్శకుడు రవీంద్ర, ఫైట్‌ మాస్టర్‌ వెంకట్‌ పనితీరు అద్భుతం. నటీనటులు రాజా, ఆదర్శ్‌, సుదర్శన్‌ తదితరులు బాగా నటించారు. వారికి మంచి పేరు వచ్చింది’.

‘గత ప్రెస్‌మీట్‌లో కాజల్‌ గురించి మాట్లాడలేదు. కాజల్‌ ఈ సినిమాలో నటించినందుకు ధన్యవాదాలు. తనది చిన్న పాత్ర అయినా చేశారు. తన పాత్ర నిడివి ఇంకా చాలా ఉంది. కానీ సినిమా నిడివి ఎక్కువ కావడంతో కట్‌ చేశారు. కల్యాణితో నా ప్రేమకథ అందరికీ నచ్చింది. నేను ఇప్పటి వరకూ ఇలాంటి ప్రేమకథలో నటించలేదు. నిన్న మార్నింగ్‌ షో సమయంలో చిత్ర బృందం అంతా చాలా టెన్షన్‌ పడుతూ ఉన్నాం. మధ్యాహ్నం షో నుంచి మంచి టాక్‌ వచ్చింది’ అని శర్వా చెప్పారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.