Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145094
            [news_title_telugu_html] => 

చరణ్‌, సురేందర్‌ నా మాట వినలేదు: చిరు

[news_title_telugu] => చరణ్‌, సురేందర్‌ నా మాట వినలేదు: చిరు [news_title_english] => My dream come true with syeraa says chiranjeevi [news_short_description] => ‘సైరా’ సినిమాతో తన కల నెరవేరిందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఆయన కథానాయకుడిగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఇది. రామ్‌ చరణ్‌ నిర్మాత. అక్టోబరు 2న చిత్రం విడుదల కాబోతోంది. తెలుగుతోపాటు హిందీలోనూ సినిమా .... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => uoMY2xKqyTo [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 16:32:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చరణ్‌, సురేందర్‌ నా మాట వినలేదు: చిరు - My dream come true with syeraa says chiranjeevi - EENADU
close

తాజా వార్తలు

చరణ్‌, సురేందర్‌ నా మాట వినలేదు: చిరు

‘భారీ బడ్జెట్‌ వల్ల అప్పుడు ధైర్యం చేయలేకపోయా’

హైదరాబాద్‌: ‘సైరా’ సినిమాతో తన కల నెరవేరిందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఆయన కథానాయకుడిగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఇది. రామ్‌ చరణ్‌ నిర్మాత. అక్టోబరు 2న చిత్రం విడుదల కాబోతోంది. తెలుగుతోపాటు హిందీలోనూ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడారు. ఆ విశేషాలివి..

ఇది నా కల

‘మన దేశం కోసం పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ అందరికీ తెలియదు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియాగా తీయాలనుకున్నా. ఎందుకంటే.. భారతీయులంతా నరసింహారెడ్డి గురించి తెలుసుకోవాలి. ఈ కథ చాలా ఏళ్ల క్రితమే నా దృష్టికి వచ్చింది. కానీ ఎక్కువ బడ్జెట్‌ అవుతుందన్న కారణంతో సినిమా తీసే ధైర్యం చేయలేకపోయాను. కానీ ఇప్పుడు రామ్‌ చరణ్‌, సురేందర్‌ రెడ్డి ముందుకొచ్చారు. దీంతో నా కల నెరవేరింది. దీన్ని నేను బాధ్యతగా ఫీల్‌ అయ్యా. నా సినిమా బాలీవుడ్‌లోనూ విడుదల కాబోతోంది. ఇది ది బెస్ట్‌ కంటెంట్‌. అందుకే తెలుగుతోపాటు వివిధ భారత దేశ భాషల్లో విడుదల చేస్తున్నాం’.

ఒకేఒక్క మెగాస్టార్‌ ఆయనే..

‘అమితాబ్‌ నా రియల్‌ లైఫ్‌ మెంటార్‌. నాకు తెలిసి ఒకేఒక్క మెగాస్టార్‌ ఉన్నారు. ఆయనే అమితాబ్‌ బచ్చన్‌. ఆయనతో కలిసి పనిచేయడం ఓ అద్భుతమైన అనుభవం. ఈ సినిమాలో నా గురువు పాత్ర కోసం అమితాబ్‌ను తీసుకుందామని సురేందర్‌ రెడ్డి నాతో అన్నారు. నేను బిగ్‌బికి ఫోన్‌ చేశా. ‘సైరా’లో నా గురువు పాత్ర, చాలా ప్రత్యేకమైందని చెప్పాను. ఆయన వెంటనే నటిస్తానని ఒప్పుకున్నారు. థాంక్యూ అమితాబ్‌ బచ్చన్‌ జీ’.

చరణ్‌ ఒప్పుకోలేదు

‘ఈ వయసులో యాక్షన్‌ సీక్వెన్స్‌లో నటించడం కాస్త కష్టంగా అనిపించింది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, గ్రాఫిక్స్‌ ఉపయోగించమని చెబితే.. సురేందర్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ ఏ మాత్రం ఒప్పుకోలేదు. నిజానికి నా భుజానికి ఆపరేషన్‌ జరిగింది. అయినా సరే.. వీళ్లు నన్ను వదల్లేదు (నవ్వుతూ). నాతో కత్తిసాము, గుర్రపుస్వారీ చేయించారు. నిజానికి నాకు శ్రమించడం అంటే ఇష్టం. ఈ ప్రయాణాన్ని చాలా ఎంజాయ్‌ చేశా. సినిమా అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. 2007 తర్వాత నేను దాదాపు పదేళ్లు నటనకు దూరంగా ఉన్నాను. ఈ గ్యాప్‌లో చిత్ర పరిశ్రమలో చాలా మార్పులు జరిగాయి. కానీ అప్పటి ఎమోషన్స్‌, కంటెంట్‌ అలానే ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

‘మేం మిమ్మల్ని హిందీ సినిమాల్లో చూడాలి అనుకుంటున్నాం. కానీ మీరు ఎందుకు ఇక్కడ నటించేందుకు ఇబ్బందిపడుతున్నారు?’ అని ఓ విలేకరి ఇదే సందర్భంగా రామ్‌ చరణ్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘నేను హిందీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎప్పుడూ ఇబ్బందిపడలేదు. ‘సైరా’ ఓ మంచి కథ కాబట్టి.. దాన్ని హిందీలో విడుదల చేయబోతున్నాం. సరైన కంటెంట్‌తో రావడం కూడా ముఖ్యం కదా. వచ్చే ఏడాది ఎస్‌.ఎస్‌. రాజమౌళి సర్‌ తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా హిందీలోనూ విడుదల కాబోతోంది. ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతోంది. అది నా కమ్‌బ్యాక్‌ సినిమా (బాలీవుడ్‌లో) అవుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు.

 

 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.