close

తాజా వార్తలు

మరో 15 హరోప్‌ డ్రోన్లు

ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలుకు భారత్‌ సన్నాహాలు

దిల్లీ: భారత రక్షణ బలగాలను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా మరో 15 మానవరహిత యుద్ధ విమానాల(డ్రోన్‌) కొనుగోలుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ తరహా డ్రోన్‌ల తయారీలో పేరుగాంచిన ఇజ్రాయెల్‌ నుంచి వీటిని కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. హరోప్‌ రకానికి చెందిన డ్రోన్‌లను పరిశీలిస్తున్నారు. ఎలక్ట్రో ఆప్టికల్‌ సెన్సార్‌లతో పనిచేసే ఈ తరహా విమానాలు శత్రు స్థావరాలపై దాడికి ఉపయోగకరంగా ఉంటాయి.  దాడి చేయడానికి ముందు లక్ష్యం చేసిన పరిసరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఇవి ఎంతో తోడ్పాటును అందిస్తాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.

‘హరోప్‌ డ్రోన్‌ల కొనుగోలు ప్రతిపాదనలపై వచ్చే వారం జరిగే రక్షణశాఖ ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. వీటి చేరికతో మానవరహిత యుద్ధ విమానాల విషయంలో భారత్‌ మరింత బలోపేతమవుతుంది’ అని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే హెరాన్‌, సెర్చర్‌ తరహా డ్రోన్‌లను అందిస్తున్న ఇజ్రాయెల్‌ ఇప్పుడు హరోప్‌ డ్రోన్‌లను కూడా భారత్‌కు అందించనుందన్నారు. దీంతో పాటు ‘చీతా’ ప్రాజెక్టు అమలుపై సైతం చర్చించనున్నామన్నారు. ఇప్పటికే ఉన్న డ్రోన్‌లకు మరింత సాంకేతికతను జోడించి భారత ఆయుధ సంపత్తిని బలోపేతం చేయడమే ప్రాజెక్టు చీతా అని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా వాటి నిఘా, దాడి సామర్థ్యాలను పెంచనున్నామన్నారు. ఇప్పటికి 100 మానవరహిత యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో ఉన్నాయి. ప్రాజెక్టు అనంతరం దేశీయంగా డ్రోన్ల తయారీపై సైతం దృష్టి సారిస్తామని వివరించారు.

అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌, పాకిస్థాన్‌లోని పలు లక్ష్యాలను ఛేదించడానికి అమెరికా మానవరహిత యుద్ధ విమానాలను విరివిగా వాడుతోంది. లాడెన్‌ అంతమొందించడానికి ముందు అతని కదలికలపై నిఘా కోసం అమెరికా డ్రోన్‌లను ఉపయోగించిందని అప్పట్లో వార్తలు వెలువడ్డ విషయం తెలిసిందే.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.