close

తాజా వార్తలు

ఈపీఎఫ్‌పై 8.65% వడ్డీరేటు

దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధిపై 2018-19 ఏడాదికి 8.65% వడ్డీరేటు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో సంఘటిత రంగంలోని ఆరు కోట్లకు పైగా ఉద్యోగులకు మేలు కలగనుంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే వడ్డీరేటు స్వల్పంగా పెంచడం గమనార్హం.

‘భవిష్యనిధి చందాదారులకు 2018-19కి గాను ఈపీఎఫ్‌వో నిర్ణయించిన 8.65% వడ్డీరేటుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్‌ఎస్‌) ఆమోదం తెలిపింది’ అని ఓ అధికారి వెల్లడించారు. భవిష్యనిధిపై 2017-18లో 8.55% ఉన్న వడ్డీరేటును 2018-19లో 8.65 శాతానికి పెంచారు. అయితే 2015-16లో 8.8శాతంగా ఉన్న వడ్డీ రేటును 2016-17లో 8.65 శాతానికి తగ్గించడం గమనార్హం.

 ఆర్థికమంత్రిత్వ శాఖ 2018-19 వడ్డీరేటుకు ఆమోదం తెలపడంతో కార్మికశాఖ, ఆదాయపన్ను శాఖ త్వరలోనే ఈ విషయం నోటిఫై చేయనుంది. ఈపీఎఫ్‌వో అంచనా ప్రకారం 8.65% వడ్డీ ఇచ్చినా రూ.151.67 కోట్లు మిగులు ఉంటుంది. అదే 8.70% అయితే రూ.158 కోట్లు లోటు అవుతుందని సమాచారం.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.