close

తాజా వార్తలు

ఉత్కంఠగా ‘గేమ్‌ ఓవర్‌’ టీజర్‌

హైదరాబాద్‌: కథానాయిక తాప్సి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘గేమ్‌ ఓవర్‌’. అశ్విన్‌ శరవనన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వైనాట్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ప్రచార చిత్రంలో తాప్సిని మాత్రమే చూపించారు. ఆమె గేమ్స్‌ను డిజైన్‌ చేసే అమ్మాయి పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. తాప్సిని హత్య చేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నిస్తూ కనిపించారు. ‘మనకు రెండు జీవితాలు ఉంటాయి.. రెండోది మొదలయ్యే సరికీ.. ఒక  జీవితమే ఉందని అర్థం అవుతుంది’ అంటూ కథను టీజర్‌లో చెప్పే ప్రయత్నం చేశారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు సంభాషణలను వెంకట్‌ కాచర్ల రాశారు. రోన్‌ ఎథాన్‌ యోహన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.