Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 123267
            [news_title_telugu_html] => 

 ‘నాగ్‌’ ప్రయోగం సఫలం

[news_title_telugu] =>  ‘నాగ్‌’ ప్రయోగం సఫలం [news_title_english] => india carried out three successful tests of the indigenous Nag anti tank guided missiles [news_short_description] => యుద్ధ ట్యాంకుల విధ్వంసక క్షిపణి ‘నాగ్‌’ను ఆదివారం విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) వెల్లడించింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఈ పరీక్షలు జరిగినట్లు తెలిపారు...... [news_tags_keywords] => NAG,Missile,DRDO,Pokhran [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-08 23:21:29 [news_isactive] => 1 [news_status] => 2 ) )
 ‘నాగ్‌’ ప్రయోగం సఫలం - india carried out three successful tests of the indigenous Nag anti tank guided missiles - EENADU
close

తాజా వార్తలు

 ‘నాగ్‌’ ప్రయోగం సఫలం

జైపూర్‌: యుద్ధ ట్యాంకుల విధ్వంసక క్షిపణి ‘నాగ్‌’ను ఆదివారం విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) వెల్లడించింది. రాజస్థాన్‌లోని పొఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఈ పరీక్షలు జరిగినట్లు తెలిపారు. మొత్తం మూడు సార్లు ఈ ప్రయోగం చేశామన్నారు. రాత్రి, పగలు రెండు సమయాల్లో నాగ్‌ క్షిపణి తన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో చేరిందని తెలిపారు. గతేడాది ఈ క్షిపణి శీతాకాల సామర్థ్య పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మరికొన్ని పరీక్షల అనంతరం ఇది భారత రక్షణ దళాల అమ్ములపొదిలో చేరనుంది. 

మూడోతరం సాంకేతికతకు చెందిన ఈ నాగ్‌ క్షిపణికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకసారి పేల్చితే లక్ష్యాన్ని దానంతట అదే వేటాడుతూ వెళ్లే సామర్థ్యం దీని సొంతం. అలాగే దీనిలో ఉన్న అధునాతన ఇమేజింగ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ రాడార్‌ సీకర్‌(ఐఆర్‌ఆర్‌) సాంకేతికత కేవలం కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉంది. లక్షిత ట్యాంకు ఉష్ణోగ్రత, దాని పరిసరాల ఉష్ణోగ్రత మధ్య తేడాను పసిగట్టి లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో చేధించడం ఈ ఐఆర్‌ఆర్‌ ప్రత్యేకత. అలాగే క్షిపణి బరువు సైతం తక్కువగా ఉంటుందని.. ఎలాంటి ప్రదేశానికైనా తరలించడం సులభమని డీఆర్‌డీవో తెలిపింది. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.