close

తాజా వార్తలు

అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా యువకుడి మృతి

ఐరాల, న్యూస్‌టుడే: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం మిరియంగంగనపల్లెకు చెందిన పత్తిపాటి ఉమాపతినాయుడు, ఉమాదేవి బెంగళూరులో స్థిరపడ్డారు. వీరి కుమారుడు వివేక్‌(24) అమెరికాలోని నార్త్‌ కరోలిన యూనివర్సిటీలో చదువుతున్నాడు. షార్లెట్‌ నగరంలోని ఓ పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పెట్రోల్‌ బంకులో విధులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా.. ఓ వాహనం వివేక్‌ను ఢీకొంది. ప్రమాదంలో వివేక్‌ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. వివేక్‌ మృతదేహం బుధవారం మిరియంగంగనపల్లెకు తీసుకువస్తున్నట్లు బంధువులు తెలిపారు.

చదువులో ఎప్పుడూ ముందే...: వివేక్‌ చదువులో ఎప్పుడూ మొదటి స్థానం సాధించేవాడని బంధువులు తెలిపారు. మృతుడి తండ్రి ఉమాపతినాయుడు వృత్తిరీత్యా న్యాయవాది. చిత్తూరులో న్యాయవాద వృత్తి చేస్తూ.. బెంగళూరులో స్థిరపడ్డారు. వివేక్‌ 5వ తరగతి వరకు చిత్తూరులో, 6 నుంచి బీటెక్‌ వరకు బెంగళూరులో చదివాడు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మిరియంగంగనపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.