
తాజా వార్తలు
జంగారెడ్డిగూడెంలో ఘటన - బంధువుల ఆందోళన
మృతి చెందిన సావిత్రి
జంగారెడ్డిగూడెం అర్బన్, న్యూస్‌టుడే(పశ్చిమగోదావరి): జంగారెడ్డిగూడెంలో ని ఓ దంత వైద్యశాలలో గురువారం సాయంత్రం మహిళకు పన్ను తొలగిస్తుండగా ఆమె మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వైద్యుని నిర్లక్ష్యం వల్లే తన తల్లి చనిపోయిందంటూ ఆమె కుమారుడు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం.. కామవరపుకోట మండలం అంకాలంపాడు గ్రామానికి చెందిన నిజవరపు సావిత్రి (55) పన్ను బాధతో జంగారెడ్డిగూడెంలోని ఓ దంత వైద్యశాలకు మధ్యాహ్నం వచ్చారు. సాయంత్రం సావిత్రిని లోపల పడుకోబెట్టి పన్ను తీసేందుకు మత్తు ఇంజక్షను ఇచ్చారు. వైద్యుడు పన్ను తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె పడిపోయారు. దీంతో దంత వైద్యుడు గుండె సంబంధిత వైద్యుడిని తీసుకువచ్చినా అప్పటికే ఆమె మృతి చెందినట్లు చెప్పారు. దీంతో మృతురాలి బంధువులు తమకు న్యాయం చేయాలంటూ వైద్యుడిని డిమాండు చేశారు. కామవరపుకోట నుంచి నాయకులు వచ్చి ఆందోళనకారులతో, వైద్యుడితో మాట్లాడారు.మృతురాలి బంధువులు సుమారు రెండు గంటలపాటు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలతో మాట్లాడి సర్దిచెప్పారు. ఘటనపై ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ శివకుమార్ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ మత్తు మందు ఇచ్చిన వెంటనే సావిత్రి కంగారు పడ్డారని, వెంటనే గుండె ఆగిపోయిందని తెలిపారు. పాడయిన పన్నుకు మాత్రమే మత్తు మందు ఇచ్చామన్నారు. ఇందులో తమ నిర్లక్ష్యం ఎంతమాత్రం లేదన్నారు. సంఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని జంగారెడ్డిగూడెం ఎస్సై అల్లు దుర్గారావు తెలిపారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
