close

తాజా వార్తలు

అధికారిని ఇంట్లో కట్టేసి చోరీ చేశారు!

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఒక సివిల్‌ సర్వీస్‌ అధికారి ఇంట్లో చొరబడి ఆ దంపతులను తాళ్లతో కట్టేసి చోరీకి పాల్పడటం కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభ్‌రో నండీ అనే వ్యక్తి కోల్‌కతాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హబ్రాలో అభివృద్ధి అధికారిగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వారి ఇంట్లోకి ఐదుగురు దోపిడీ దొంగలు చొరబడి భార్యాభర్తలిద్దర్నీ తాళ్లతో కట్టేసి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువుల్ని చోరీ చేశారు. ఘటన అనంతరం ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారంతా హిందీ మాట్లాడుతున్నట్లు ఫిర్యాదులో వెల్లడించారు. ఈ విషయం జిల్లా మేజిస్ట్రేట్‌ దృష్టికి వెళ్లడంతో ఘటనపై సత్వర చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.