
తాజా వార్తలు
చిత్రంలోని యువకుడి పేరు వెంకటేష్. నివాసం హైదరాబాద్ సోమాజిగూడలోని ఎంఎస్ మక్తా. ఇందిరాపార్కు సమీపంలో నివాసం ఉండే ఓ యువతితో ఇటీవల పెళ్లి సంబంధం మాట్లాడుకున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు నిశ్చితార్థం జరపాలని నిర్ణయించారు. పది గంటలకు ఎంఎస్ మక్తాలోని ఇంటిదగ్గర నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బయల్దేరగా లిబర్టీ వద్ద బారికేడ్లు దర్శనమిచ్చాయి. హిమాయత్‌నగర్ మీదుగా అశోక్‌నగర్ వెళ్లే ప్రయత్నం చేయగా అక్కడా అనుమతించలేదు. తిరిగి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ఇందిరాపార్కు వైపు వెళ్లాలనుకున్నా సాధ్యం కాలేదు. దీంతో అమ్మాయి తరఫు వారికి ఫోన్ చేశారు. వారు చెప్పిన ప్రకారం లోయర్ ట్యాంక్‌బండ్ దారిలోని కట్టమైసమ్మ గుడి నుంచి వెళ్లాలని భావించినా అక్కడా బారికేడ్లతో పోలీసులు అడ్డుతగిలారు.‘‘వివాహ నిశ్చితార్థం కోసం వెళ్తున్నాం..రెండు గంటల నుంచి చుట్టూ తిరిగి వచ్చాం..అనుమానం ఉంటే మాతోపాటు కానిస్టేబుళ్లను పంపండి. దయ చేసి మమ్మల్ని పోనివ్వండి’’ అంటూ మొరపెట్టుకున్నా పోలీసు అధికారుల నుంచి స్పందన రాలేదు. దీంతో వారు వెనుదిరిగి వెళ్లక తప్పలేదు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఆదివారం ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన మహాదీక్షను అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన పద్మవ్యూహం.. ఆ యువకుడి నిశ్చితార్థం వాయిదా పడేలా చేసింది.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- 8 మంది.. 8 గంటలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- సినిమా పేరు మార్చాం
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- మరోసారి నో చెప్పిన సమంత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
