
తాజా వార్తలు
ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్
లండన్: 1996లో శ్రీలంక విశ్వ విజేతగా నిలిచిన తర్వాత 23 ఏళ్లకు మరో జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడనుంది. ఇప్పటికే ఫైనల్స్ చేరిన న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు ఆదివారం లార్డ్స్ మైదానంలో తుదిపోరులో తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా తొలిసారి విశ్వవిజేతగా నిలుస్తుంది. ఇదిలా ఉండగా ఆది నుంచి ఫేవరెట్‌గా భావించిన ఇంగ్లాండ్ జట్టు ఫైనల్స్‌లో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా ఆశాభంగమే మిగులుతుంది. ప్రపంచకప్ ఫైనల్స్ ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ కివీస్ జట్టును ఫైనల్స్‌లో ఓడించడం అంత తేలిక కాదని పేర్కొన్నాడు.
టీమిండియాతో జరిగిన తొలి నాకౌట్లో న్యూజిలాండ్ జట్టు తక్కువ పరుగులే చేసినా ఆ స్కోరును ఎలా కాపాడుకున్నారో గుర్తుచేశాడు. కివీస్ బౌలర్లు మాట్హెన్రీ, ట్రెంట్‌బౌల్ట్ బలమైన భారత బ్యాటింగ్‌ను దెబ్బతీశారని, వారితో జాగ్రత్తగా ఆడాలని మోర్గాన్ చెప్పుకొచ్చాడు. టోర్నీ ఆసాంతం కివీస్ అద్భుతంగా పోరాడిందని, అయితే భారత్‌తో జరిగిన నాకౌట్లో అత్యద్భుత ప్రదర్శన చేసిందని మెచ్చుకున్నాడు.
కాగా న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ విలియమ్సన్ ఒక్కడే బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. టీమిండియాతో మ్యాచ్‌లో మాత్రం రాస్‌టేలర్ కీలకంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ ఈ ప్రపంచకప్‌లో తన స్థాయికి తగ్గ బ్యాటింగ్ చేయలేకపోవడం కివీస్‌కు ప్రతికూలంగా మారింది. ఒకవేళ ఫైనల్స్‌లో గనుక కివీస్ బ్యాట్స్‌మెన్ చెలరేగితే ఇంగ్లాండ్‌కు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
