close

తాజా వార్తలు

దంచికొట్టిన సంజు శాంసన్‌: భారత్‌ విజయం

తిరువనంతపురం: కేరళ కుర్రాడు సంజు శాంసన్‌ చెలరేగాడు. దక్షిణాఫ్రికా-ఏతో జరిగిన ఆఖరి వన్డేలో చెలరేగి ఆడాడు. కేవలం 48 బంతుల్లో 91 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో అతడి ఆట అద్భుతంగా సాగింది. అతడి విధ్వంసం చూసి ప్రత్యర్థి బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. అతడికి తోడుగా శిఖర్‌ ధావన్‌ (51; 36 బంతుల్లో 5×4, 2×6) మెరుపు అర్ధశతకం చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (36; 19 బంతుల్లో 5×4, 1×6) సమయోచితంగా ఆడటంతో భారత్‌-ఏ 204 పరుగులు చేసింది.

భారీ లక్ష్య ఛేదనకు దిగిన సఫారీలను యువ పేసర్‌ శార్ధూల్‌ ఠాకూర్‌ భారీ దెబ్బకొట్టాడు. 3 ఓవర్లు వేసి 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ (59; 43 బంతుల్లో 10×4) ఒంటరి పోరాటం చేశాడు. కైల్‌ వెరెయెన్‌ (44; 24 బంతుల్లో 3×4, 4×6) రాణించాడు. వీరిద్దరు మినహా మరెవ్వరూ 20 పరుగుల స్కోరు చేయలేదు. వాషింగ్టన్‌ సుందర్‌ 2 వికెట్లు తీశాడు. ఇషాన్‌ పోరెల్‌, తుషార్‌ దేశ్‌పాండే, రాహుల్‌ చాహర్‌, శివమ్‌ దూబె తలో వికెట్‌ తీశారు. వన్డే సిరీస్‌ను భారత్‌-ఏ 4-1 తేడాతో కైవసం చేసుకుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.