Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009314
            [news_title_telugu_html] => 

విరాట్‌, రోహిత్‌ లోపాల్ని సరిదిద్దాను: బంగర్‌

[news_title_telugu] => విరాట్‌, రోహిత్‌ లోపాల్ని సరిదిద్దాను: బంగర్‌ [news_title_english] => Time to reflect refresh and reinvent says Sanjay Bangar [news_short_description] => టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా తిరిగి ఎంపిక చేయనందుకు నిరాశ పడ్డానని సంజయ్‌ బంగర్‌ అన్నాడు. ఐతే ఆ బాధ తక్కువ రోజులకే పరిమితమని పేర్కొన్నాడు. తాజా ఆలోచనలు చేసేందుకు, తనపై తాను సమయం పెట్టేందుకు ఈ విరామం .... [news_tags_keywords] => Virat kohli,sanjay bangar,Team India,shikar dhawan,Rohit sharma [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 00:16:00 [news_isactive] => 1 [news_status] => 2 ) )
విరాట్‌, రోహిత్‌ లోపాల్ని సరిదిద్దాను: బంగర్‌ - Time to reflect refresh and reinvent says Sanjay Bangar - EENADU
close

తాజా వార్తలు

విరాట్‌, రోహిత్‌ లోపాల్ని సరిదిద్దాను: బంగర్‌

ముంబయి: టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా తిరిగి ఎంపిక చేయనందుకు నిరాశ పడ్డానని సంజయ్‌ బంగర్‌ అన్నాడు. ఐతే ఆ బాధ తక్కువ రోజులకే పరిమితమని పేర్కొన్నాడు. తాజా ఆలోచనలు చేసేందుకు, తనపై తాను సమయం పెట్టేందుకు ఈ విరామం ఉపయోగపడుతుందని వెల్లడించాడు. విదేశీ జట్లకు కోచింగ్‌ ఇవ్వడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. తన హయాంలో రోహిత్‌, రహానె, పుజారా బ్యాటింగ్‌ టెక్నిక్‌లో మార్పులు చేశానని బంగర్‌ అన్నాడు.

‘నిరాశ కలగడం అత్యంత సహజం. అయితే కొన్ని రోజులే బాధపడ్డాను. బీసీసీఐ, కోచ్‌లు డంకన్‌, అనిల్‌, రవికి ధన్యవాదాలు. భారత క్రికెట్‌కు ఐదేళ్లు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. ఆలోచన ధోరణి మార్చుకొనేందుకు, నాపై నేను సమయం పెట్టేందుకు ఈ విరామం ఉపయోగించుకుంటాను’ అని బంగర్‌ అన్నాడు. అతడు బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్నప్పుడే కోహ్లీ 43, రోహిత్‌ శర్మ 28, ధావన్‌ 18, పుజారా 12 శతకాలు బాదడం గమనార్హం.

‘తన లోపాలు సరిదిద్దుకొనేందుకు విరాట్‌ నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. క్రీజులో అతడు నిలబడే విధానం, వేగంగా బంతులు వచ్చే పరిస్థితుల్లో బ్యాటింగ్‌పై మేం కలిసి పనిచేశాం. శిఖర్‌ను తొలుత ఆఫ్‌సైడ్‌ ఆటగాడిగా భావించారు. అతనెప్పుడూ బంతిని పక్కగా ఆడేందుకు ప్రయత్నించేవాడు. మైదానంలోని ఇతర ప్రదేశాల్లోనూ పరుగులు చేసేలా మార్చాం. షార్ట్‌పిచ్‌ బంతులకు ఔటవ్వకుండా శిక్షణ ఇచ్చాం. తన మీదికి దూసుకొచ్చే బంతులకు ఎల్బీ అవ్వకుండా ఉండేందుకు రోహిత్‌ శర్మ తలను నిలపడంపై నిలకడగా పనిచేశాం. పుజారా విషయంలో అతడి స్టాన్స్‌ మధ్య ఖాళీని తగ్గించాం. భారత క్రికెటర్లు కాస్త ఎత్తు తక్కువ ఉంటారు కాబట్టి కాళ్ల మధ్య అంతరం ఎక్కువగా ఉండొద్దు. బ్యాట్స్‌మెన్‌ కొన్ని పాత పద్ధతులు, టెక్నిక్‌లు వదిలేసేలా డంకన్‌ నేతృత్వంలో కృషిచేశాం’ అని బంగర్‌ తెలిపాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.