close

తాజా వార్తలు

నంబర్‌ ‘4’ ఎలా ఎంపిక చేస్తారంటే: బంగర్‌

ముంబయి: సెలక్టర్‌ దేవాంగ్‌ గాంధీతో అమర్యాదగా ప్రవర్తించినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం అని టీమిండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అన్నాడు. ఎంపిక ప్రక్రియ ముగిసిన మూడు రోజుల తర్వాత తన ప్రజెంటేషన్‌పై మర్యాదగా ఆయనతో చర్చించానని తెలిపాడు. తమ ఇద్దరి మధ్య గొడవపై వచ్చిన వార్తలన్నీ నిరాధారమని వెల్లడించాడు. జట్టుతో ఐదేళ్లు విదేశాల్లో పర్యటించాను కాబట్టి ఇప్పట్లో బయట జట్లకు కోచింగ్‌ ఇచ్చే అవకాశం లేదన్నాడు. ఆటగాళ్లు తమ భవిష్యత్తు చూసుకుంటారు గానీ కోచ్‌ల గతం గురించి పట్టించుకోరని బంగర్‌ స్పష్టం చేశాడు. రహానెకు సారథి కోహ్లీ అనేక అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడని పేర్కొన్నాడు.

‘గత 18 నెలలుగా రహానె అర్ధశతకాలను శతకాలుగా మార్చలేకపోయాడు. అయినప్పటికీ జోహన్స్‌బర్గ్‌, నాటింగ్‌హామ్‌, అడిలైడ్‌ సహా విదేశీ పిచ్‌లపై మంచి విజయాలు అందించాడు. వెస్టిండీస్‌ సిరీస్‌లో అతడు శతకం చేయడం సంతోషకరం. రిషభ్‌పంత్‌ టెస్టు క్రికెట్‌లో అందరి అంచనాలను తారుమారు చేశాడు. అతను ఆలోచించి ఆడే క్రికెటర్‌. పేసర్లపై దాడి చేసేందుకు సాహసం చేస్తాడు. వన్డే క్రికెట్‌ను అర్థం చేసుకోవడానికి యువకులకు కాస్త సమయం పడుతుంది. అప్పుడు గాల్లోకి బంతిని లేపి ఔటవ్వకుండా చూసుకుంటారు’ అని బంగర్‌ అన్నాడు.

ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో ఆటగాడిని ఆటగాళ్లు, జట్టు యాజమాన్యం, కోచ్‌లు అందరూ కలిసే నిర్ణయం తీసుకున్నారని బంగర్‌ స్పష్టం చేశాడు. ప్రస్తుత ఫామ్‌, ఫిట్‌నెస్‌, ఎడమచేతి వాటమా, బౌలింగ్‌ చేయగలడా వంటి అంశాల ఆధారంగా నాలుగో స్థానంలో ఆటగాడిని ఎంపిక చేస్తారని తెలిపాడు. బ్యాటింగ్‌ కోచ్‌గా బంగర్‌ పనిచేసిన కాలంలో టీమిండియా చక్కని విజయాలు సాధించింది. 52 టెస్టుల్లో 30 గెలిచింది. 11 ఓడింది. ఆటగాళ్లు 70 శతకాలు బాదారు. ఇక 122 వన్డేల్లో భారత్‌ 82 గెలిచి 35 ఓడింది. 74 శతకాలు నమోదయ్యాయి. 66 టీ20ల్లో 43 గెలవగా 21 ఓడింది. 6 శతకాలు బాదేశారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.