Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000055
            [news_title_telugu_html] => 

‘కోడెల అలా వ్యవహరించడం సరికాదు’

[news_title_telugu] => ‘కోడెల అలా వ్యవహరించడం సరికాదు’ [news_title_english] => Ap assembly Deputy speaker Kona raghupathi comments on misuse of assembly furniture [news_short_description] => అసెంబ్లీ ఫర్నిచర్‌ని ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవడాన్ని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి తీవ్రంగా ఖండించారు. కోడెల చేసిన పని సభ్యసమాజం తలదించుకొనేలా ఉందని నిందించారు. సీనియర్‌ నేత, సుదీర్ఘ అనుభవం... [news_tags_keywords] => Kona Raghupathi,Deputy Speaker,Ap assembly,Ap News  [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 21:56:22 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘కోడెల అలా వ్యవహరించడం సరికాదు’ - Ap assembly Deputy speaker Kona raghupathi comments on misuse of assembly furniture - EENADU
close

తాజా వార్తలు

‘కోడెల అలా వ్యవహరించడం సరికాదు’

ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి

 

రాజమహేంద్రవరం:అసెంబ్లీ ఫర్నిచర్‌ని ఏపీ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవడాన్ని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి తీవ్రంగా ఖండించారు. కోడెల చేసిన పని సభ్యసమాజం తలదించుకొనేలా ఉందని నిందించారు. సీనియర్‌ నేత, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కోడెల.. ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారన్నారు. శాసనసభలో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని చేస్తున్న ప్రచారాన్ని కోన రఘుపతి కొట్టిపారేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ యువ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర పురోభివృద్ధికి సీఎం తీసుకొస్తున్న ఆదర్శవంతమైన సంస్కరణలు అభినందనీయమన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.