
తాజా వార్తలు
పోషకాలు అందించే బార్లీ వేసవికి సహజసిద్ధమైన ఔషధం లాంటిది. శరీరంలోని వేడిని తగ్గించి, తక్షణ శక్తిని అందించే గుణాలు ఇందులో అధికం. అసలు ఇది ఎలా మేలు చేస్తుందంటే...
* బార్లీలోని పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
* కాల్షియం, ఇనుము, మాంగనీసు, మెగ్నీషియం, జింక్, రాగి వంటి ఖనిజ లవణాలు... విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది బార్లీ.
* ఈ గింజలు హృద్రోగాలను దరి చేరనివ్వవు. అధిక బరువును తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు... వ్యాధి నిరోధకశక్తి కూడా పెరుగుతుంది.
* బార్లీ శరీరంలో అధిక నీటిని కూడా తొలగిస్తుంది. మూత్ర సంబంధ సమస్యలను కూడా అదుపులో ఉంచుతుంది.
* బార్లీ నీటికి మజ్జిగ, నిమ్మరసం, తేనె, నారింజ రసాన్ని కలిపి తాగితే... రుచిగా ఉండటమే కాదు, వేసవిలో శరీర ఉష్ణోగ్రతను సమతూకం చేస్తుంది. ఎవరైనా బార్లీ నీటిని తాగొచ్చు.
మజ్జిగతో కలిపి... బార్లీని లేత గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించుకుని, పొడి చేసుకోవాలి. మూడు కప్పుల నీటిని పొయ్యిపై పెట్టి మరిగించాలి. అలాగే రెండు చెంచాల బార్లీ పొడిని పావుకప్పు నీటిలో ముందుగా కలిపి ఉంచుకోవాలి. మరిగిన నీటిలో ఈ మిశ్రమాన్ని కలపాలి. పది నిమిషాలు ఉడికించి చల్లార్చి వడకట్టుకోవాలి. ఈ నీటికి పావు గ్లాసు పల్చని మజ్జిగ, చిటికెడు ఉప్పు వేసి ఈ వేసవిలో తరచూ తాగితే మంచిది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- నలుదిశలా ఐటీ
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- స్కైన్యూస్ నుంచి హెచ్‌సీఎల్ సీఈవోగా..
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
