close

తాజా వార్తలు

తెలంగాణ అకడమిక్‌ క్యాలెండర్‌ ఇదే..!

హైదరాబాద్‌: తెలంగాణలో 2019-20 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రకటించింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 232 రోజులు పాఠశాలలు పనిచేయనున్నాయి. సిలబస్‌ పూర్తి, పరీక్షల నిర్వహణ, సెలవుల వివరాలను విద్యాశాఖ ఈ క్యాలెండర్‌లో పేర్కొంది. 

క్యాలెండర్‌లో ముఖ్య తేదీలివే..
* పదో తరగతి విద్యార్థులకు జనవరి 10 నాటికి సిలబస్‌ పూర్తి
* ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఫిబ్రవరి 29 నాటికి సిలబస్‌ బోధన పూర్తి 
* అక్టోబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 26 వరకు ఎస్‌ఏ 1 పరీక్షలు
* ఏప్రిల్‌ 7 నుంచి ఏప్రిల్‌ 16 వరకు ఎస్‌ఏ 2 పరీక్షలు
* ఫిబ్రవరి 29 నాటికి పదో తరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు పూర్తి
* సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 13 వరకు మొత్తం 16 రోజులు దసరా సెలవులు
* మిషనరీ పాఠశాలలకు డిసెంబర్‌ 22 నుంచి 28 వరకు ఏడు రోజులు క్రిస్మస్‌ సెలవులు
* జనవరి 11 నుంచి 16 వరకు 6 రోజులు సంక్రాంతి సెలవులు
* ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు

అకడమిక్‌ క్యాలెండర్‌ జీవో కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.