Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 112928
            [news_title_telugu_html] => 

ఆదివాసీల నిర్బంధంపై కొనసాగుతున్న విచారణ

[news_title_telugu] => ఆదివాసీల నిర్బంధంపై కొనసాగుతున్న విచారణ [news_title_english] => Hc Inquiry on Kumram Bheem Tribels issue [news_short_description] => కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆదివాసీల నిర్బంధం అంశం హైకోర్టు ముందుకు వచ్చింది. ఆదివాసీలను అటవీశాఖ అధికారులు నిర్బంధించడంపై ఉన్నత న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది. హైకోర్టు [news_tags_keywords] => Ts Highcourt, Inquiry, Ts News [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-16 18:07:00 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆదివాసీల నిర్బంధంపై కొనసాగుతున్న విచారణ - Hc Inquiry on Kumram Bheem Tribels issue - EENADU
close

తాజా వార్తలు

ఆదివాసీల నిర్బంధంపై కొనసాగుతున్న విచారణ

హైదరాబాద్‌: కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆదివాసీల నిర్బంధం అంశం హైకోర్టు ముందుకు వచ్చింది. ఆదివాసీలను అటవీశాఖ అధికారులు నిర్బంధించడంపై ఉన్నత న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటి వద్ద ఈ విచారణ జరుగుతోంది. కొలంగొండి గ్రామానికి చెందిన 67 మంది గిరిజనులను ఊరికి దూరంగా ఉన్న వేంపల్లి ఫారెస్టు డిపోలో నిర్బంధించారని, వారిని కోర్టు ముందు హాజరుపరచేలా ఆదేశాలివ్వాలంటూ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ శనివారం హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఆదివారం సాయంత్రం ఆదివాసీలను తమ ముందు హాజరుపరచాలని అటవీశాఖ అధికారులను ఆదేశించింది. 
ఈ నేపథ్యంలో 16 కుటుంబాలకు చెందిన పెద్దలను టూరిజం బస్సులో హైదరాబాద్‌ తీసుకొచ్చారు. తొలుత వారిని సైఫాబాద్‌లోని అరణ్యభవన్‌కు తీసుకొచ్చిన అధికారులు.. అక్కడి నుంచి కుందన్‌బాగ్‌లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లారు. హైకోర్టు తాత్కాలిక సీజే ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ సమక్షంలో విచారణ కొనసాగుతోంది. పిటిషనర్‌, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.