close

తాజా వార్తలు

ఆ రెండు యాప్‌లు జాతి వ్యతిరేకం..!

దిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ సామాజిక మాధ్యమ యాప్‌లు టిక్‌టాక్‌, హలోలను భారత్‌లో నిషేధించాలని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ సభ్యులు ఆదివారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఎస్‌జేఎం జాతీయ కో కన్వీనర్‌ అశ్వనీ మహజన్‌ లేఖలో ఈ యాప్‌లపై పేర్కొంటూ.. ఇవి ప్రజల్లో జాతీయ వ్యతిరేక భావాలను రేకెత్తిస్తూ సమాజాన్ని చీల్చేస్తున్నాయని అన్నారు. ఈ రెండు యాప్‌ల వల్ల భారతీయ యువతలో  స్వార్థపూరిత ధోరణి ప్రభావం పడుతోందని వెల్లడించారు. హలో యాప్‌ గురించి మాట్లాడుతూ.. ఈ యాప్‌ రూ.7కోట్లు చెల్లించి ఇతర సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్‌ చేసిన రాజకీయ ప్రకటనలు ఇచ్చిందని ఆరోపించారు.  లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇదే విషయమై పలువురు భాజపా కార్యకర్తలు ఈసీకి ఫిర్యాదు చేశారని అన్నారు. చైనాకు చెందిన ఈ యాప్‌ భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను పాడు చేసే దురుద్దేశంతో ప్రారంభించారని వెంటనే వాటిని నిషేధించాలని కోరారు. ఈ యాప్‌ ద్వారా చైనా భారతదేశాన్ని సామాజికంగా సంక్షోభంలో నెట్టివేసేందుకు ప్రయత్నిస్తోందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.