
తాజా వార్తలు
రామ్పురహాట్: కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన మహిళకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. ఆమె కడుపులోంచి చిన్నపాటి నిధిని బయటకు తీశారు. పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లా రామ్పురహాట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నగరానికి చెందిన ఓ మహిళ కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మహిళ పొట్టలో లోహ పదార్థం ఉందని నిర్థరించారు. అనంతరం శస్త్రచికిత్స చేయగా ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఆ మహిళ ఉదరంలోంచి ఏకంగా 1.680 కేజీల లోహ వస్తువులు బయటపడ్డాయి. వాటిలో బంగారం, ఇత్తడి, ఇనుము వంటి లోహాలతో చేసిన గొలుసులు, దుద్దులు, గడియారం, నాణేలు ఉన్నాయి. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, సీసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నామని వైద్యుడు సిద్ధార్థ్ విశ్వాస్ చెప్పారు. బాధితురాలు విపరీతమైన ఆకలితో బాధపడేదని, బహుశా అందుకే తమ దుకాణాల్లోని వస్తువులు మింగి ఉండొచ్చని కుటుంబసభ్యులు తెలిపారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
- ఉసురు తీశాడు.. ఉరిపోసుకున్నాడు
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
