close

తాజా వార్తలు

తాడోపేడో తేల్చుకుంటాం: చంద్రబాబు

అమరావతి: వైకాపా ప్రభుత్వ అరాచకాలు ఒక్క పల్నాడు ప్రాంత సమస్య మాత్రమే కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అయితే ఈ ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని తెలిపారు. అందువల్లే ఇక్కడి నుంచి పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తెదేపా పోరాటంతో పల్నాడు అక్రమ కేసుల గురించి మాట్లాడుతున్న పోలీసులు.. ఇతర ప్రాంతాల్లో బనాయించిన కేసుల గురించి ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యనేతలతో పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునే స్థితికి వచ్చామని, రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు, నాయకులంతా గుంటూరు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

బాధితులును ఆదుకోవాలన్నదే తెదేపా దృఢ సంకల్పమని చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా అరాచకాలను తెదేపా వెలుగులోకి తెచ్చేదాకా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం చేశారని ఆయన నిలదీశారు. బాధితులందరికీ న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రేపటి చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైకాపా నాయకులు అన్నివిధాల ప్రయత్నిస్తారని, ఒక వేళ అడ్డుకుంటే అక్కడికక్కడే ధర్నాలు చేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు. 110 రోజులుగా వేలాది బాధితులు గ్రామాలకు దూరంగా ఉన్నారన్నారు. 

పోలీసులు ఒకవైపు శిబిరంలో చర్చలు జరుపుతూనే మరోవైపు గురజాల డివిజన్ లో 144సెక్షన్ విధించారని చంద్రబాబు విమర్శించారు. పండుగల పేరుతో 144 సెక్షన్ విధించామంటూ అసత్యాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఇది పండుగల శాంతిభద్రతలకు సంబంధించిన అంశం కాదని, రాజకీయ శాంతిభద్రతల సమస్యని వివరించారు. బాధితులపై నమోదు చేసిన తప్పుడు కేసులన్నింటినీ ఎత్తివేయాలని, ధ్వంసమైన ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.