close

తాజా వార్తలు

విజయ డెయిరీ పాలకమండలి కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌: బేగంపేటలోని హరితప్లాజాలో విజయడైరీ పాలకమండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, విజయ డెయిరీ ఛైర్మన్‌ లోక భూమారెడ్డి, ఎండీ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. 

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే..

* జాతీయ రహదారుల వెంట విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 
* ప్రైవేటు డెయిరీల ఉత్పత్తుల ధరలకు అనుగుణంగా విజయ డెయిరీ ఉత్పత్తుల ధరలు ఉండాలి.
* అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలలో విజయ డెయిరీ ఉత్పత్తులు వినియోగించేలా ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి. 
* అన్ని దేవాలయాల్లో విజయ నెయ్యి ఉపయోగించేలా చర్యలు చేపట్టాలి.
* సమ్మక్క - సారక్క జాతరలో 150 సంచార వాహనాల ద్వారా విజయ ఉత్పత్తులు విక్రయించాలి.

* విక్రయాలు మరింత పెంచడానికి సినిమా థియేటర్‌లు, టీవీలు, సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించాలి.
* విజయ ఉత్పత్తులు తెలిసేలా హైవేలు, పర్యాటక ప్రాంతాల్లో హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.