close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. పవన్‌ ర్యాలీకి తెదేపా మద్దతు:చంద్రబాబు

ఇసుక  కొరత వల్ల జరిగిన ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇసుక కొరత కారణంగా ఉపాధి కోల్పోయిన బాధితులతో గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోవడం వల్లనే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందన్నారు. పవన్‌కల్యాణ్‌ విశాఖలో తలపెట్టిన నిరసన ర్యాలీకి తెదేపా మద్దతు ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. కార్మికులకు అండగా ఉంటాం: విపక్షనేతలు

సీపీఐ సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు దీక్ష విరమించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీపీఐ కార్యాలయంలో ఆయన నిరవధిక దీక్ష చేపట్టగా... పోలీసులు దీక్షను భగ్నం చేసి నిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన నిమ్స్‌లోనే దీక్ష కొనసాగించారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు ప్రజా సంఘాలు, విపక్ష నేతలు నిమ్స్‌కు చేరుకుని కూనంనేని దీక్ష విరమింపజేశారు. కార్మికులకు అండగా ఉంటామని విపక్షనేతలు స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ముగిసిన గీతాంజలి అంత్యక్రియలు

గుండెపోటుతో ఈ ఉదయం మృతిచెందిన సినీనటి గీతాంజలి అంతక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ‘మా’ ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్‌తో పాటు రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ, శివాజీరాజా, రమాప్రభ, ఉత్తేజ్‌, బాబూమోహన్‌, అన్నపూర్ణ, ప్రభ, కవిత సహా పలువురు నటీనటులు, అభిమానులు గీతాంజలి పార్థివదేహానికి నివాళుర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ‘చంద్రబాబుకు పవన్‌ ఇచ్చిన కాల్షీట్లు అవ్వలేదు’

విశాఖ భూములపై గత ప్రభుత్వం వేసిన సిట్‌ విచారణ తెదేపా నేతలను కాపాడేలా ఉందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. సిట్‌ పరిధి, విచారణ గడువును పెంచాల్సిందిగా సీఎం జగన్‌ను కోరతామని ఆయన వెల్లడించారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రాజధానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. చంద్రబాబుకు పవన్‌ ఇచ్చిన కాల్షీట్లు ఇంకా అయిపోలేదని విజయసాయి వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. నిర్భయ దోషులకు త్వరలో మరణశిక్ష

నిర్భయ సామూహిక అత్యాచార ఘటనలో దోషులకు విధించిన మరణశిక్షను త్వరలోనే అమలు చేయనున్నామని తిహాడ్‌ జైలు అధికారులు తెలియజేశారు.  ఈ సమాచారాన్ని దోషులకు కూడా అక్టోబరు 28న తెలియజేశామని అధికారులు చెప్పారు. మరణశిక్షను సవాల్‌ చేసే హక్కు దోషులకు ఉన్నప్పటికీ, నలుగురిలో ఎవరూ దరఖాస్తు చేయలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. అమిత్‌షాతో కేటీఆర్‌ భేటీ

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో కేటీఆర్‌ సమావేశమయ్యారు. బేగంపేట సమీపంలోని రసూల్‌పుర వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమం కింద కొంత స్థలాన్ని కేటాయించాలని అమిత్‌షాను కేటీఆర్‌ కోరారు. ఇంటర్‌ స్టేట్‌ పోలీస్‌ వైర్‌లెస్ స్టాఫ్‌ క్వార్టర్స్‌కు చెందిన 1.62 ఎకరాల స్థలాన్ని జీహెచ్‌ఎంసీకి అప్పగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. అమ్మకానికి 13 లక్షల క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు

సుమారుగా 13 లక్షల మంది భారతీయులకు సంబంధించిన క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వివరాలు డార్క్‌ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్టు సమాచారం. ఈ వివరాలన్నీ డార్క్‌ వెబ్‌లో ‘జోకర్స్‌ స్టాష్‌’ అనే సంస్థ కొనుగోలుకు ఉంచిందని గ్రూప్‌ ఐబీ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. ‘ఇండియా-మిక్స్‌-న్యూ-01’ పేరుతో జోకర్‌ స్టాష్‌ డార్క్‌ వెబ్‌లో కార్డుల అమ్మకాల గురించి ప్రకటన ఇస్తున్నట్లుగా గ్రూప్‌ ఐబీ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. మరో కార్మికుడిని బలిగొన్న ఇసుక కొరత

ఇసుక కొరత గుంటూరు జిల్లాలో మరో కార్మికుడిని బలితీసుకుంది. చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన నాగూర్‌ వలి తాపీమేస్త్రిగా జీవనం సాగిస్తున్నాడు. ఇసుక కొరత కారణంగా గత నాలుగునెలల నుంచి పనుల్లేక ఉపాధి కోల్పోయాడు.  దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ఈనెల 26న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. రాహుల్ విదేశాల్లో ఏం చేస్తున్నారు?: జీవీఎల్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ విదేశీ పర్యటనలకు సంబంధించిన పూర్తి వివరాలను పార్లమెంట్‌కు తెలియజేయాల్సిందిగా భాజపా జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు డిమాండ్‌ చేశారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో రాహుల్‌ గాంధీ 16 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లగా.. వాటిలో 9 పర్యటనలకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. చైనాకు భారత్‌ వార్నింగ్‌!

జమ్మూకశ్మీర్‌ విభజనను తప్పుబట్టిన చైనాకు భారత్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ‘‘భారత సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఇతర దేశాలు గౌరవిస్తాయని మేం భావిస్తున్నాం. భారత అంతర్గత వ్యవహారాల్లో చైనా సహా ఇతర దేశాల వ్యాఖ్యలను మేం ఆశించడం లేదు’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.