Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 123748
            [news_title_telugu_html] => 

ఆ బిల్లు మరుగున పడినట్లే: హాంకాంగ్‌

[news_title_telugu] => ఆ బిల్లు మరుగున పడినట్లే: హాంకాంగ్‌ [news_title_english] => Protesters unmoved as Hong Kong leader says China extradition bill dead [news_short_description] => నేరపూరిత చర్యలకు పాల్పడి పట్టుబడిన వారిని చైనాకు అప్పగించే చట్టాన్ని తీసుకురావాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇందుకు వ్యతిరేకంగా ఇటీవల హాంకాంగ్‌లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చెలరేగిన విషయం తెలిసిందే.   [news_tags_keywords] => Hong Kong,China,extradition bill [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-09 23:42:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆ బిల్లు మరుగున పడినట్లే: హాంకాంగ్‌ - Protesters unmoved as Hong Kong leader says China extradition bill dead - EENADU
close

తాజా వార్తలు

ఆ బిల్లు మరుగున పడినట్లే: హాంకాంగ్‌

హాంకాంగ్‌: నేరపూరిత చర్యలకు పాల్పడి పట్టుబడిన వారిని చైనాకు అప్పగించే చట్టాన్ని తీసుకురావాలని హాంకాంగ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇందుకు వ్యతిరేకంగా ఇటీవల హాంకాంగ్‌లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చెలరేగిన విషయం తెలిసిందే. నిరసన ప్రదర్శనలతో హాంకాంగ్‌ రోడ్లన్నీ ఇటీవల జనసముద్రాన్ని తలపించాయి. దీంతో ప్రభుత్వం ఇంకాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.  ఈ బిల్లు పూర్తిగా మరుగున పడినట్లేనని హాంకాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యారీ లామ్‌ ప్రకటించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ... ఈ బిల్లు ఆమోదం పొందడానికి తాము చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయని అంగీకరించారు. ఈ బిల్లును మరోసారి పార్లమెంటులో ప్రవేశపెట్టాలని తాము అనుకోవట్లేదని, అటువంటి ప్రణాళికలు తమ వద్దలేవని, ఇది పూర్తిగా మరుగున పడిందని ఆమె తెలిపారు.

అయితే, ఈ బిల్లును లెజిస్లేటివ్‌ అజెండా నుంచి పూర్తిగా ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌ను మాత్రం క్యారీ లామ్‌ తిరస్కరించారు. దీంతో ప్రజాస్వామ్య ఉద్యమకారులు మరోసారి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆమె మంగళవారం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యాలేనని ఉద్యమకారుడు జోషువా వాంగ్‌ తెలిపారు. 2014లో ఓ ఉద్యమంలో పాల్గొని అరెస్టైన ఆయన ఇటీవలే విడుదలయ్యారు. ‘‘లెజిస్లేటివ్‌ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికీ ఈ బిల్లు ఉంది.. ఇది వచ్చే ఏడాది జులై వరకు ఇలాగే ఉంటుంది’’ అని పౌర హక్కుల సంస్థ ప్రకటించింది. ఆ త్వరలోనే మరోసారి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన నిరసన ప్రదర్శనలు ఈ సంస్థ ఆధ్వర్యంలోనే జరిగాయి. కొన్ని రోజుల క్రితం జరిగిన ఆందోళనలతో హాంకాంగ్‌ ప్రభుత్వం బిల్లును  సస్పెండ్ చేసింది. అయితే, అధికారికంగా మాత్రం దాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో జులై 1, 1997 రోజును గుర్తు చేసుకుంటూ (బ్రిటీష్‌ పరిపాలన నుంచి హాంకాంగ్‌ బయటపడిన తేదీ) ఈ రోజున మరోసారి వేలాది మంది ప్రజలు భారీ ప్రదర్శనలు నిర్వహించి, విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో ఈ బిల్లు మరుగున పడినట్లేనంటూ క్యారీ లామ్‌ ప్రకటన చేశారు.  


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.