
తాజా వార్తలు
దిల్లీ: విదేశీ మారక ద్రవ్యం సమీకరించేందుకు బాండ్స్ జారీ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలపై ఆర్బీఐ వచ్చే నెల సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రణాళికపై ఆర్థికవేత్తలు పెదవి విరవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. ఆగస్టు 16వ తేదీన ఆర్బీ బోర్డు భేటీ కానుంది. ఈ భేటీలో బాండ్ల అంశంతో పాటు పలు విషయాలు చర్చించనున్నారు. ప్రధాని కార్యాలయ సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. మరోపక్క ఆర్థిక మంత్రి మాత్రం బాండ్ల జారీ ఉంటుందన్నట్లే ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించారు.
ఇటీవల ప్రభుత్వం సావరీన్ బాండ్లను జారీ చేయాలని నిర్ణయించింది. దీనిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శించారు. ‘‘భారత్ పరిస్థితి బాగున్నప్పుడు వీటిని కొంటారని పరిస్థితి బాగోనప్పుడు అమ్మేస్తారని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.