close

తాజా వార్తలు

సొలిసిటర్‌ జనరల్‌ భార్యపై దాడి

దిల్లీ: దేశరాజధానిలో నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. సామాన్యులే కాదు ప్రముఖులు కూడా దుండగుల బారిన పడుతున్నారు. తాజాగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా భార్య అపర్ణ మెహతాపై దాడి జరగడం గమనార్హం. 

దిల్లీలోని ప్రముఖ మండీ హౌస్‌ సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిక్కీ ఆడిటోరియం వద్ద అపర్ణ మెహతాపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆమె నుంచి మొబైల్‌ ఫోన్‌ లాక్కొన్ని పరారయ్యారు. ఈ హఠాత్పరిణామంతో ఆందోళనకు గురైన అపర్ణ వెంటనే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.